సోనూ సూద్ పై ఇన్ కం టాక్స్ కన్నుపడింది.

    0
    270

    కోట్లు సంపాదిస్తూ ప‌న్నులు ఎగ్గొట్టే వారిని వ‌దిలేస్తారు ? కోట్లు ముంచి పారిపోయిన వాళ్ళ‌ని ప‌ట్టించుకోరు  స‌మాజానికి సేవా చేయాల‌నుకునే వారిని మాత్రం టార్గెట్ చేస్తారు. లాక్ డౌన్ రియ‌ల్ హీరో సోనూసూద్ విష‌యంలో ఇదే జ‌రిగింది. సోనూసూద్ ఆఫీసు, నివాసాల‌పై ఇన్‌కం ట్యాక్స్ అధికారులు త‌నిఖీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనికి స‌ర్వే అని నామ‌క‌ర‌ణం చేయ‌డం విశేషం.లాక్ డౌన్ స‌మ‌యంలో, క‌రోనా క్లిష్ట స‌మ‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా చేయ‌లేని ఎన్నో సేవ‌ల‌ను అందించారు సోనూసూద్‌. వెండితెర‌పై విల‌న్ గా క‌నిపించినా, నిజ‌జీవితంలో మాత్రం రియ‌ల్ హీరోగా అనిపించుకున్నారు.

    వేలమంది వ‌ల‌స కార్మికుల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపేందుకు, రైళ్ళు, బ‌స్సులు.. ఆఖ‌రికి విమాన స‌ర్వీసులు కూడా ఏర్పాటు చేశారాయ‌న‌. క‌ష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఆద‌రించి, వారికి ఉపాధి కూడా క‌ల్పించారు. జ‌నం గుండెల్లో దేవుడిగా కొలువుదీరాడు సోనూ. అలాంటి సోనూసూద్ ఆఫీసు కార్యాల‌యాల‌పై, నివాసాల‌పై ఐటీ శాఖ దాడులు చేసింది. ఆయ‌న‌కు సంబంధించిన ఆరు నివాసాలతో పాటు ఆఫీసుల కార్యాల‌యాల‌పై స‌ర్వే పేరుతో త‌నిఖీ చేసింది. ఆయ‌న‌కు సంబంధించిన ట్ర‌స్టీలు, ఆదాయ వ్య‌యాలు, ఆర్ధిక లావాదేవీల‌పై ఆరా తీసింది. ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారనే వార్త దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

    ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియ‌మించారు. పంజాబ్ ప్రభుత్వం కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంద‌రితో హీరో అనిపించుకున్న సోనూ నివాసాల‌పై స‌ర్వే పేరుతో ఐటీ అధికారులు దాడులు చేయ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్