బ్యాంక్ అకౌంట్లలో మోదీ డబ్బులు వేస్తున్నారా?

  0
  173

  బీహార్ లోని ఖగారియా జిల్లాలోని భక్తియార్ పూర్ లో రంజిత్ దాస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఉన్నట్టుండి ఆ అకౌంట్ లోకి 5.5 లక్షల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. ఆ విషయం తెలుసుకున్న రంజిత్ దాస్ వాటిని విత్ డ్రా చేసుకున్నాడు. అయితే అవి ఎక్కడినుంచి వచ్చాయో, ఎందుకు వచ్చాయో అతనికి తెలియదు.

  పొరపాటున ఎవరో తెలియకుండా అతని అకౌంట్లో డబ్బుల డిపాజిట్ చేశారు. తీరా బ్యాంక్ ఉద్యోగులు పొరపాటు గ్రహించి ఆ డబ్బులు తిరిగివ్వాలని అడిగారు. అయితే రంజిత్ దాస్ అడ్డం తిరిగాడు. ఆ డబ్బులు తనకు మోదీ ఇచ్చారని, గతంలో మోదీ ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తానని చెప్పారని, అవే తనకు వచ్చాయని అంటున్నాడు. డబ్బులు తిరిగిచ్చేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది పోలీస్ కేసు పెట్టారు. పోలీసులు రంజిత్ దాస్ ని అదుపులోకి తీసుకున్నారు.

  ఇవీ చదవండి..

  మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

  25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్