రేప్ కేసులో ఐఐటీ స్టూడెంట్ కి బెయిల్..

  0
  553

  రేప్ కేసులో ఐఐటీ స్టూడెంట్ కి బెయిల్ ఇస్తూ గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. బెయిల్ ఇచ్చే నేపథ్యంలో రేప్ చేసిన విద్యార్థి, రేప్ కి గురైన విద్యార్థి ఇద్దరూ రాష్ట్రానికి చెందిన ఆస్తులేనంటూ జడ్జి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జస్టిస్ అజిత్ బోర్థాకూర్ ఈ తీర్పునిచ్చారు. ఐఐటీ గౌహతికి చెందిన బీటెక్ స్టూడెంట్, తన సహ విద్యార్థినిపై మార్చి 28న రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితులారు అతడి చెరనుంచి తప్పించుకుని తర్వాతి రోజు ఆస్పత్రిలో చేరింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి నిందితుడిని ఏప్రిల్ 3న అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిందితుడు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. విచారణ జరిపిన కోర్టు.. వారిద్దరూ రాష్ట్రానికి చెందిన ఆస్తుల వంటి వారని వ్యాఖ్యానించింది. ఇద్దరూ ప్రతిభావంతులని అందుకే ఐఐటీ వరకు రాగలిగారని చెప్పింది.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్