ఏపీలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు కరోనా

  0
  1105

  కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపర్రు హైస్కూల్ లో 10మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ప్రతి స్కూల్ లో వారానికోసారి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం స్కూల్ విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేపట్టారు. వాటి ఫలితాలు ఈరోజు వచ్చాయి. మొత్తం 10మంది విద్యార్థులకు కరోనా వచ్చినట్టు తేలింది. దీంతో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. అధికారులు స్కూల్ కి సెలవు ప్రకటించారు. తిరిగి స్కూల్ ఎప్పుడు తెరుస్తారనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏపీలో ఈనెల 16నుంచి స్కూల్స్ పునఃప్రారంభం కాగా.. స్కూల్ విద్యార్థులకు కరోనా రావడం ఇదే తొలిసారి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్