నీళ్లలో ఐ ఫోన్ 10నెలలు, అయినా ఓకే..

  0
  1934

  మొబైల్ ఫోన్ ఇప్పుడు అందరికీ ముఖ్యమైన వస్తువు.. ఎక్కడికి వెళ్లినా ఆ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లడం మనకు అలవాటుగా మారిపోయింది. అయితే ఈ ఫోన్ ఒక్కసారిగా కనిపించకుండా పోతే మనం ఎంతగా బాధపడిపోతాం.. అదే కాస్తంత కాస్ట్ లీ ఐ ఫోన్ అయితే మరింతగా తల్లడిల్లిపోతాం. ఇలాంటి ఘటనే యూకేలో జరిగింది. డేవిస్ అనే వ్యక్తి 2021లో ఓ నది సమీపంలో మిత్రులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీ జరుగుతున్న సమయంలో ఆ ఫోన్ నీళ్ళల్లో పడిపోయింది. నదిలో పడిపోయిన ఫోన్ పడిపోవడంతో చేసేదేమీ లేక ఇంటికెళ్లిపోయాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ఫోన్ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు.

  అయితే దాదాపుగా ఈ ఘటన జరిగిన పది నెలల తర్వాత నీటిలోని ఐ ఫోన్ మరొక వ్యక్తి కంటపడింది. వెంటనే ఆ వ్యక్తి ఆ ఫోన్ ఎవరిదో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. అయినా నీళ్లలో పడిన ఫోన్ ద్వారా అది సాధ్యం కాదు కదా అనుకుంటూనే.. ఎందుకైనా మంచిదని ఓసారి ఛార్జింగ్ పెట్టాడు. ఆశ్చర్యం.. ఆ ఫోన్ వెంటనే ఆన్ అయింది. అంతేకాదు.. ఆగస్ట్ 13వ తేదీతో డేవిస్ దంపతుల ఫోటో కూడా స్క్రీన్ సేవర్ గా కనిపించింది.

  ఇంకేముంది వెంటనే ఆ వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ తతంగం మొత్తాన్ని పోస్టులో వివరించాడు. ఈ ఐ ఫోన్ పోస్ట్ ఫోటో వివరాలను చాలా మంది తమ వాల్స్ పై షేర్ చేశారు. చివరకు డేవిస్ కు తన మిత్రుల ద్వారా ఈ విషయం తెలిసింది. దీంతో ఆ వ్యక్తి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పి ఫోన్ తెచ్చుకున్నాడు.

  అయితే 10 నెలల క్రితం నీటిలో పడిపోయిన ఫోన్.. ఇన్నిరోజులు తర్వాత కూడా ఎలా పని చేస్తుందన్న విషయం మాత్రం మిస్టరీగా మారింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.