6 లక్షలు 10 రూపాయల కాయిన్స్ తో కారు కొన్నాడు.

    0
    183

    మ‌న దేశంలో ప‌ది రూపాయ‌ల నాణేలు చెల్ల‌వా ? చెల్లుతాయ‌ని కేంద్రం చెబుతుంది. అయినా ఎక్క‌డా చెలామ‌ణిలో క‌నిపించ‌డం లేదు. ఏదైనా కిరాణా షాపుకి వెళ్ళి ప‌ది రూపాయ‌ల నాణెం ఇస్తే.. చెల్ల‌దంటూ వెన‌క్కి ఇచ్చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇలాగే జ‌రుగుతోంది. దీంతో.. అది నిజ‌మే అనుకుని ప‌ది రూపాయ‌ల కాయిన్ల‌ను ఇళ్ళ‌ల్లో పెట్టేస్తున్నాం. కానీ ఓ డాక్ట‌ర్ మాత్రం .. ఈ విష‌యాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ప‌ది రూపాయ‌ల నాణేల‌న్నీ సేక‌రించి, ఏకంగా కారునే కొనేశాడు. ఆ వివ‌రాలు తెలియాలంటే.. ఈ ప‌ది రూపాయ‌ల నాణేల వెన‌క ఉన్న క‌థేంటో తెలియాలి.

    త‌మిళ‌నాడుకు చెందిన వెట్రివేల్ ఓ డాక్ట‌ర్. ఆయ‌న‌కు 27 ఏళ్ళు. త‌న కుటుంబంతో క‌లిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్ళాడాయ‌న‌. బిల్లు 210 రూపాయ‌లు అయింది. జేబులో నుంచి 200 రూపాయ‌ల నోట్‌, 10 రూపాయిల కాయిన్ ఇచ్చాడు. అయితే ఆ రెస్టారెంట్ వాళ్ళు మాత్రం 10 రూపాయ‌ల కాయిన్ చెల్ల‌దంటూ వెన‌క్కి ఇచ్చారు. దీనిపై ఆయ‌న వారితో వాగ్వాదానికి దిగాడు. అయినా వాళ్ళు ససేమిరా అన‌డంతో.. ప‌ది రూపాయ‌ల నోట్ ఇచ్చి, ఇంటికి వ‌చ్చేశాడు.

    ఆ త‌ర్వాత బంధువుల ఇళ్ళ‌కు వెళ్ళిన‌ప్పుడు 10 రూపాయిల కాయిన్ల‌తో పిల్ల‌లు ఆడుకోవ‌డం గ‌మ‌నించాడు. అలాగే కొంత‌మంది స్కూల్ విద్యార్ధులు కూడా 10 రూపాయిల నాణేల‌తో తొక్కుడు బిళ్ళ‌లు ఆడుతుండ‌డం చూశాడు. డ‌బ్బుల‌తో ఆట‌లేంటి అని అడిగిన వేట్రివేల్‌కి.. ఇది చెల్ల‌దని, ప‌నికి రాద‌ని ఇంట్లో వాళ్ళు చెప్పారంటూ బ‌దులిచ్చారు. అప్ప‌టి నుండి ఆ డాక్ట‌ర్ ఈ 10 రూపాయిల కాయిన్ గురించి సీరియ‌స్ గా ఆలోచించాడు.

    ఈ క్ర‌మంలో 10 రూపాయ‌ల కాయిన్ గురించి ఫైనాన్స్ మినిస్ట‌ర్ కి లేఖ రాశాడు వేట్రివేల్. త‌న‌కు ఎదురైన అనుభ‌వాల గురించి ప్ర‌స్తావించాడు. 10 రూపాయ‌ల కాయిన్ చెలామ‌ణిలో ఉందంటూ ఫైనాన్స్ మినిస్ట‌ర్ నుంచి రిప్ల‌య్ కూడా వ‌చ్చింది. దీంతో ఆయ‌న 10 రూపాయ‌ల కాయిన్లు క‌లెక్ట్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. అలా ఏకంగా 6 ల‌క్ష‌ల రూపాయ‌ల స‌మాన‌మైన 10 రూపాయిల నాణేల‌ను సేక‌రించాడు. వాట‌న్నింటినీ బ‌స్తాల్లో వేసి.. ఓ మినీ వ్యానులోకి ఎక్కించి.. నేరుగా మారుతి షోరూమ్‌కి వెళ్ళాడు. ఆ బ‌స్తాల‌ను దించి, త‌న‌కు కారు కావాల‌ని కోరాడు. అయితే యాజ‌మాన్యం మాత్రం ఆ నాణేల‌ను తీసుకోవ‌డానికి అంగీక‌రించ‌లేదు. దీంతో ఆ డాక్ట‌ర్ వారితో వాగ్వాదానికి దిగాడు.

    తాను ఆల్రెడీ కారు బుక్ చేసుకున్నాన‌ని, అందుకు అవ‌స‌ర‌మైన న‌గ‌దు కూడా తెచ్చాన‌ని, తన‌కు కారు ఎందుకు ఇవ్వ‌రంటూ వేట్రివేల్ ద‌బాయించాడు. 10 రూపాయ‌ల నాణేల‌ను తాము తీసుకోవ‌డం లేద‌ని షోరూమ్ డీల‌ర్ తేల్చి చెప్పారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన డాక్ట‌ర్‌.. 10 రూపాయ‌ల కాయిన్స్ చెల్లుబాటులో ఉన్నాయ‌ని, కేంద్రం చెబుతుంటే మీరు ఎందుకు తీసుకోరంటూ గ‌ట్టిగా నిల‌దీశాడు. ఈ డ‌బ్బులు తీసుకుని కారు ఇస్తారా ? లేక కోర్టుకు వెళ్ళి మీ సంగ‌తి తేల్చ‌మంటారా ? అంటూ హెచ్చ‌రించాడు.

    దీంతో షోరూమ్ డీల‌ర్ కాస్త త‌గ్గి.. ఈ న‌గ‌దును బ్యాంకులో క‌ట్ట‌మ‌ని చెప్పి, ఆ న‌గ‌దును మారుతీ డీల‌ర్ అకౌంట్‌లో ట్రాన్స‌ఫ‌ర్ చేయ‌మ‌ని రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఆ డాక్ట‌ర్ నేరుగా బ్యాంకుకు వెళ్ళి.. 6 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే 10 రూపాయ‌ల నాణేల‌ను క‌ట్టాడు. ఆ త‌ర్వాత మారుతీ షోరూమ్‌కి వెళ్ళి… తాను బుక్ చేసుకున్న మారుతి ఈకో కారును సొంతం చేసుకున్నాడు. 10 రూపాయ‌ల నాణేలు చెలామ‌ణిలో ఉన్నాయని నిరూపించ‌డానికే ఆయ‌న ఈ ప్ర‌య‌త్నం చేశాడు. సో.. ఇక‌నైనా 10 రూపాయ‌ల కాయిన్స్ ప‌డేయ‌కండి. అవ‌స‌ర‌మైన చోట వాడండి. 10 రూపాయ‌ల‌ నాణం చెల్లుతుందని ఆర్‌బీఐ అధికారికంగా ప్రకటించిన విష‌యాన్ని గుర్తుంచుకోండి.

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.