అదృష్టమంటే ఈ కొత్త జంటదే.. యుక్రెయిన్ లో యుద్ధం మొదలయ్యేందుకు ఒకరోజు ముందే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ హైదరాబాద్ వచ్చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే రిసెప్షన్ ఏర్పాటు చేసి, ఆనందం పంచుకున్నారు.
ఇది సినిమా కధకు సరిపోయే స్టోరీ.. హైదరాబాద్ కు చెందిన ప్రతీక్ అనే యువకుడు.. మల్లిఖార్జున్, పద్మజాల కొడుకు. యుక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. అక్కడే లిబోవ్ అనే యువతిని ప్రేమించి, గత నెల 23న పెళ్లి కూడా చేసుకున్నాడు.
24వ తేదీ రష్యా.. దాడికి ముందే భార్యను తీసుకొని భార్యతో సహా హైదరాబాద్ వచ్చేశాడు. ఇప్పుడు హైదరాబాద్ లో తన బంధుమిత్రులందరినీ పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చాడు. ఒకరోజు ముందు ఇండియాకి రాకపోయి ఉంటే.. కష్టాల్లో చిక్కుకునేవాడు. అదృష్టం బాగుండి.. భార్యతో సహా హైదరాబాద్ వచ్చేశాడు.
ఇవీ చదవండి…
బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి
మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..
నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..
తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..