తెలుగు రాష్ట్రాలు కూడా స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లలో జోరుగా ఉంటున్నాయి. గతంలో మాదిరి స్వలింగ సంపర్కుల ప్రేమలు , పెళ్లిళ్ల విషయంలో సమాజంలో కొంత అవగాహన , అర్ధం చేసుకునే మనస్తత్వం కనిపిస్తోంది.. దీంతో భయాలు పోయి , ఇప్పుడు బహిరంగంగానే స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో గత రెండు రోజులలో ఇద్దరు స్వలింగ సంపర్కులు తమ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకున్నారు.
మెహిందీ వేడుక , సంగీత్ , పెళ్లి , రిసెప్షన్ అబ్బో , మామూలు పెళ్లిళ్లు కూడా అంత బాగా జరగవు అన్నట్టు చేసేసారు. కలకత్తాకు చెందిన సుప్రియో , ఢిల్లీ వాసి అభయ్ చాల సంవత్సరాలుగా ప్రేయసీ ప్రియుళ్ళుగా ఉంటున్నారు. సహజీవనం చేస్తున్నారు. తాము ఇద్దరు స్వలింగ సంపర్కులు అని గర్వంగా చెప్పుకుంటారు.
ఇంతకాలం సహజీవనాన్ని , ఇద్దరూ పెళ్లితో బయటకు చెప్పేసారు. హైదరాబాద్ పొలిమేరల్లో ఉండే మెయినాబాద్‌లోని రిసార్టులో శుక్రవారం , శనివారం రెండు రోజులు పెళ్లిచేసుకున్నారు. సుప్రియో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.. అభయ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.గా పనిచేస్తున్నాడు. ఈ పెళ్ళికి హైదరాబాద్ లోని స్వలింగ సంపర్కులు వచ్చారు.. ఆటపాటలతో సందడి చేశారు..