బీర్లు , విస్కీ తాగి , టీ తాగాలని పోయి ఇలా..

  0
  40694

  నిన్న హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు టీవీ ఆర్టిస్టులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. కారు డ్రైవింగ్ చేస్తోన్న మ‌రో వ్య‌క్తి కూడా చ‌నిపోయాడు. తీవ్ర గాయాల‌తో మ‌రో టీవీ ఆర్టిస్టు సాయి సిద్దూ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసుల‌కు క్ష‌త‌గాత్రులు కొన్ని వివ‌రాలు వెల్ల‌డించాడు.

  తెల్ల‌వారుజామున షూటింగ్ ఉండ‌డంతో వారంతా రాత్రి మా ఇంటికి వ‌చ్చార‌ని, అంద‌రూ సిట్టింగ్ లో కూర్చుని మందు తాగార‌ని సాయిసిద్దు చెప్పాడు. అయితే తాను మాత్రం డ్రింక్ చేయ‌లేద‌న్నాడు. అమ్మాయిలు ఇద్ద‌రూ బీర్లు తాగార‌ని, అబ్దుల్ బ్లాక్ డాగ్ తాగాడాని చెప్పాడు.

  మందు తాగిన త‌ర్వాత రాత్రి ఒంటి గంట స‌మ‌యంలో టీ తాగుదాం అంటే వ‌ద్ద‌ని చెప్పాన‌ని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డితే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌న‌ని వారించాన‌ని తెలిపాడు. అయినా వారు విన‌క‌పోవ‌డంతో, వారితో పాటు తాను తోడు వెళ్ళాన‌ని చెప్పాడు.

  నాకు డ్రైవింగ్ రాద‌ని, అప్ప‌టికే బాగా తాగి ఉన్న అబ్దుల్ కారు డ్రైవింగ్ చేశాడ‌ని చెప్పాడు. మితిమీరిన వేగంతో వెళ్ళ‌డంతోనే ప్ర‌మాదానికి గుర‌య్యామ‌ని తెలిపారు. త‌న‌కు డ్రంక‌న్ డ్రైవ్ టెస్ట్ చేస్తే జీవో వ‌చ్చింద‌ని వివ‌రించాడు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.