ఆమెకు పెళ్ళయ్యి 20 ఏళ్ళు. 22 ఏళ్ళ ఓ కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పెట్టుకోవడమే కాదు భర్త ముందే ఆ కుర్రాడితో ప్రేమలో ఉంది..ఇంట్లో ఎదిగిన కూతురు ఉన్నా లెక్క చేసేది కాదు. చివరకు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను భర్తకు పంపించేది. ఇవి చూసి నాకు విడాకులన్నా ఇవ్వు లేదా ఉరి వేసుకుని చచ్చిపో అంటూ రెచ్చగొట్టే విధంగా భర్తతో మాట్లాడేది. దీంతో ఈ వ్యవహారాన్ని భర్త.. అత్తమామలకు చెప్పి భోరుమన్నాడు. వారు కూడా సర్దుకు పొమ్మన్నారు. భార్య కాళ్ళ మీద పడి కూతురు కోసమైనా తప్పు చేయకుండా ఉండాలని కోరాడు.
అయినా భార్య వినకుండా భర్త కళ్ళ ముందే ప్రియుడితో మోటారు సైకిల్ ఎక్కి వెళ్ళిపోవడంతో.. తన చావుకు కారణాలను వివరిస్తూ భర్త సుధేవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమబెంగాల్ లోని కల్నాలో జరిగిన దారుణమిది. భర్త చెన్నైలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రియుడి కోసం ఆమె భర్తను వదిలేసి ఇటీవల పశ్చిమబెంగాల్ లో ఉంటుంది. ఆమె పేరు తుంప. గతంలో రెండుసార్లు ప్రియుడితో లేచిపోయినా, భర్త నచ్చజెప్పి తీసుకొచ్చాడు. బుద్దిగా ఉండాలని బతిమిలాడాడు. అయినా ఆమె మారకపోగా, ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలను భర్తకు పెట్టి, ఇవి చూసి ఇంకా బతుకుతావా అంటూ రెచ్చగొట్టే విధంగా మెసేజ్ లు పెట్టడంతో.. సుధేవ్ చనిపోయాడు. చివరగా కూతురికి ప్రత్యేకంగా ఓ లేఖ రాసి తనను క్షమించమని, తల్లిలాగా కాకుండా మంచిగా ఉండమంటూ, బాగా చదువుకుని వృద్దిలోకి రావాలని కోరాడు.