2లక్షల కోట్ల 2వేల నోట్లు ఎక్కడికి పోయాయి..?

    0
    539

    పెద్ద నోట్ల రద్దు తర్వాత 2వేల రూపాయల డినామినేషన్ అందర్నీ కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. అప్పటి వరకూ వెయ్యి రూపాయల నోటుదే ఆధిపత్యం. ఆ తర్వాత 2వేల రూపాయల నోటు వచ్చి చేరింది. అయితే 2వేల నోట్లు వచ్చినట్టే వచ్చి మార్కెట్ నుంచి మాయం అయిపోయాయి. గతంలో 2వేల నోట్లు ఎక్కువగా మార్కెట్లో కనిపించేవి. ఇప్పుడు 500రూపాయల నోటుదే ఆధిపత్యం. ఎవరి జేబులో అయినా 500 రూపాయల నోటు కామన్ గా కనిపిస్తోంది. కానీ 2వేల రూపాయల నోటు మాత్రం మాయమైంది.

    ఎందుకిలా..?
    కొత్త నోట్ల ప్రింటింగ్ తర్వాత 2018 మార్చి 30 నాటికి 3 వేల 362కోట్ల.. 2 వేల రూపాయల నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. 2021 ఫిబ్రవరి 21 నాటికి 2,499 కోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. అంటే దాదాపుగా వెయ్యి కోట్ల సంఖ్యలో ఉన్న 2వేల రూపాయల నోట్లు సర్క్యులేషన్లో లేకుండా పోయాయి. వీటి విలువ దాదాపు 2లక్షల కోట్ల రూపాయలు. ఈ 2లక్షల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయి, ఎవరి బీరువాల్లో ఉన్నాయి..?

    నల్లధనం తగ్గించేందుకే ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. మరిప్పుడు జరుగుతున్నదేంటి..? 2లక్షల కోట్ల విలువైన డబ్బు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పోనీ బ్యాంకుల్లో ఉందా అంటే గ్యారెంటీ లేదు. బ్యాంకుల్లోకి వచ్చిన డబ్బు.. తిరిగి ప్రజల వద్దకే వస్తుంది. మరి ఈ 2లక్షల కోట్లు నల్లధనంగా మారిపోయింది. ఒకవేళ అదే నిజమైతే.. పెద్ద నోట్ల రద్దుతో వచ్చిన ప్రయోజనం ఏంటి? సామాన్యులు పడి నకష్టాలకు ప్రతిఫలం ఏంటి..? డబ్బున్నోళ్లు హాయిగా పెద్ద నోట్లు మార్చుకున్నారు. ఏటీఎంల ముందు క్యూ లైన్లలో నిలబడి సామాన్యులు ఇబ్బంది పడ్డారు. అయితే దీనికి మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. 2వేల రూపాయల నోట్లు ముద్రించడం ఆపేసి మరింత పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్తపడటం మాత్రం నిజం.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??