సమంత-చైతన్య జంటను విడదీసింది ఎవరు..?

    0
    1573

    పెళ్లయిన తర్వాత సమంత ఎక్కువగా నాగచైతన్యతోనే సినిమాలు చేయాలనుకుంది. అందుకే లవ్ స్టోరీలను పక్కనపెట్టి కాస్త వెరైటీ కథల్ని ఎంచుకుంటోంది. ఈ స్టేజ్ లో సమంతకు శాకుంతలం అనే సినిమా దొరికింది. అలనాటి శకుంతల-దుష్యంతుల ప్రేమ కావ్యమే శాకుంతలం కథాంశం. ఇటీవల చారిత్రక కథలపై మనసు పారేసుకుంటున్న దర్శకుడు గుణశేఖర్ చాన్నాళ్లుగా దీనిమీద వర్క్ చేస్తున్నాడు. ఆమధ్య హీరో రానాతో హిరణ్యకశిప అనే సినిమా చేయాలనుకున్నా.. అది వర్కవుట్ కాలేదు. చివరకు శాకుంతలం సినిమాని పట్టాలెక్కించాడు గుణశేఖర్. ఈ సినిమాకు ఆయన కుమార్తె నీలిమ నిర్మాత.

    ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం అనుష్కను సంప్రదించారు. బరువు తగ్గి, నాజూగ్గా మారితే ఆమెను ఫిక్స్ చేద్దామనుకున్నారు. కానీ అనుష్కే కావాలని ఆ సినిమాని వద్దనుకుంది. దీంతో ప్రాజెక్ట్ సమంత దగ్గరకు చేరింది. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. అయితే ఈ ప్యూర్ లవ్ స్టోరీలో తన భర్త నాగ చైతన్యతో కలసి నటించాలని సమంత అనుకుందట. ఆ విషయాన్నే గుణశేఖర్ కి కూడా చెప్పిందట.

    అయితే తన సినిమాలో సమంతకు జోడీగా కొత్త హీరోని పరిచయం చేయాలనుకున్నారు గుణశేఖర్. తెలుగు తెరకు పరిచయం లేని ఫేస్ ని తీసుకు రావాలనుకున్నారు. అలా అయితేనే లవ్ స్టోరీ పండుతుందని, అది పాన్ ఇండియా సినిమాగా మారుతుందని చెప్పారట. దీంతో సమంత కూడా కాంప్రమైజ్ అయింది. అలా.. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా సెలక్ట్ అయ్యాడు. దేవ్ మోహన్, సమంత జంట శాకుంతలం సినిమాలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించబోతోంది.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??