చెన్నై మళ్ళీ వణికింది.. కార్లన్నీ ఫ్లయ్ ఓవర్ లపై పార్కింగ్.

  0
  1511

  త‌మిళనాడుకు భారీ వ‌ర్ష సూచ‌న ఉంది. అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని స‌మాచారం. ఈ నేప‌ధ్యంలో త‌మిళ తంబీలు త‌మ వాహ‌నాల‌ను సుర‌క్షిత‌మైన ప్ర‌దేశంలో పార్కింగ్ చేస్తున్నారు. ఎక్క‌డ పెట్టినా వ‌ర్షాలు, వ‌ర‌ద నీటిలో బైక్‌లు, ఆటోలు, కార్లు కొట్టుకుపోతున్నాయి. గ‌తంలో దాదాపు 300 వాహ‌నాలు ఇలాగే కొట్టుకుపోయాయి. దీంతో ఫ్లై ఓవ‌ర్ల‌పై త‌మ వాహ‌నాల‌ను పార్కింగ్ చేస్తున్నారు. మ‌ద్యాహ్నం నుంచే త‌మ కార్లు, బైక్ ల‌ను ఫ్లై ఓవ‌ర్ల మీద‌కు తీసుకొచ్చి పార్క్ చేసి పోతున్నారు. ఇదే నెల మొద‌టి వారంలో కూడా చెన్నైని వ‌ర‌ద‌లు ముంచెత్త‌డంతో, ఇలాగే చేశారు త‌మిళ సోద‌రులు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

   

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.