సింధు శారీ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..

    0
    347

    ఇటీవల పద్మ పురస్కారం అందుకున్న సందర్భంగా పీవీ సిందు చీరకట్టులో మెరిసిపోయింది. అయితే ఆ చీర స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా. ఆ ఈవెంట్ తర్వాత సింధు కట్టిన చీరపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇంతకీ ఆ చీర స్పెషాలిటీ ఏంటంటే.. ?

    పద్మ పురస్కారం అందుకునే సమయంలో సింధు ఆలివ్‌ గ్రీన్‌ రంగు డబుల్‌ ఇక్కత్‌ పటోలా చీర, దానిపై కాంజీవరం బ్లౌజ్‌ ధరించి చూపరులనుఆకట్టుకుంది. ఈ పటోలా చీరకు పెద్ద చరిత్రే ఉంది. పటోలా డబుల్‌ ఇక్కత్‌ చీరల తయారీ నైపుణ్యం గుజరాత్‌లోని పటాన్‌ ప్రాంతంలో కొన్ని కుటుంబాలకే సొంతం. వాళ్లు కూడా ఆ రహస్యాన్ని తమ కొడుకులకు మాత్రమే చెబుతారు. ఈ చీర ప్రత్యేకత ఏమిటంటే.. రెండువైపులా ఒకేలా ఉంటుంది. ఆఖరికి నేత నేసిన వారు కూడా చీర పూర్తయ్యాక ఏది ముందు భాగం, ఏది వెనుక భాగం అన్నది చెప్పలేకపోతాడు. కొన్ని వందల ఏండ్లయినా రంగు చెరిగిపోదు. ఒక డబుల్‌ ఇక్కత్‌ పటోలా చీర నేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ధర విషయానికొస్తే.. పనితనాన్ని బట్టి లక్ష నుంచి రెండు లక్షల వరకూ ఉంటుంది.

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.