మేకల దొంగల చేతిలో హత్యకు గురైన ఎస్సై..

  0
  4596

  మేక‌ల దొంగ‌ల‌ను ప‌ట్టుకుని, ఆ దొంగ‌ల చేతిలోనే దారుణ హ‌త్య‌కు గురైన పోలీస్ అధికారి భూమినాధ‌న్. కానిస్టేబుల్ గా పోలీస్ శాఖ‌లో చేరి స్పెష‌ల్ ఎస్ఐ స్థాయికి ఎదిగిన భూమినాధ‌న్ కు విధి నిర్వ‌హ‌ణ‌లో అనేక అవార్డులు, రివార్డులు ఉన్నాయి. 30 ఏళ్ళ స‌ర్వీసులో ఒక్క త‌ప్పు చేయ‌కుండా ప‌ని చేసిన భూమినాధ‌న్ త‌మిళ‌నాడులోని తిరుచ్చి జిల్లా న‌వ‌ల్ ప‌ట్టు స్టేష‌న్ లో ఎస్సై గా ప‌ని చేస్తున్నారు.

  శ‌నివారం రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉండ‌గా, రెండు మోటార్ సైకిళ్ళ‌పై వెళుతున్న మేక‌ల దొంగ‌ల‌ను గుర్తించారు. ఎస్సైని చూసి దొంగ‌లు పారిపోగా, ఆయ‌న వారిని చేజ్ చేసి పుదుకొట్టై జిల్లాలో ప‌ట్టుకున్నారు. మ‌రో మోటార్ సైకిల్ పై ఉన్న ఇద్ద‌రు దొంగ‌లు వెన‌క్కి వ‌చ్చి క‌త్తుల‌తో ఎస్సైపై దాడి చేసి ఆయ‌నను చంపేశారు. హ‌త్య‌కు గురైన భూమినాధ‌న్ కుటుంబానికి కోటి రూపాయ‌ల న‌ష్ట ప‌రిహారం ప్ర‌క‌టించి, నిందితుల‌ను తీవ్రంగా శిక్షించాల‌ని ఆదేశించారు.

   

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.