పెళ్లికొడుకుతో గుర్రం పరుగో ,పరుగు..

  0
  180

  పెళ్ళికొడుకు గుర్రం మీద ఊరేగింపుగా అమ్మాయి ఇంటికి బ‌య‌లుదేరాడు. హంగుఆర్భాటాల‌తో గుర్రం మీద ద‌ర్జా కూర్చుని, స్వారీ చేస్తూ ముందుకు సాగాడు. వెంట వ‌చ్చే బంధుమిత్రుల సంద‌ళ్ళ‌తో బారాత్ జోరుగా సాగింది. అయితే మ‌ధ్య‌లో ట‌పాసులు పేల్చారు. అంతే గుర్రం ఒక్క‌సారిగా బెదిరిపోయింది. ఉన్న‌ట్టుండి గుర్రం ప‌రుగుతీసింది. పెళ్ళికొడుకు కూడా గుర్రంతోనే వెళ్ళిపోయాడు. ఈ హ‌ఠాత్ప‌రిణామంతో బిత్త‌ర‌పోయిన బంధుగణమంతా గుర్రం వెంట ప‌రుగులు పెట్టారు. కార్లు, బండ్లు వేసుకుని గుర్రాన్ని ప‌ట్టుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. అలా నాలుగు కిలోమీట‌ర్ల దూరం వెళ్ళిన త‌ర్వాత ఎట్ట‌కేల‌కు గుర్రం చిక్కింది. గుర్రం మీద పెళ్ళికొడుకు కూడా సుర‌క్షితంగా ఉండ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక నెమ్మెదిగా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురి ఇంటికి తీసుకొచ్చారు. రాజ‌స్థాన్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?