బంపర్ టు బంపర్ పార్కింగ్ లో సూపర్ డ్రైవింగ్.

  0
  4024

  పార్కింగ్‌లో ఉన్న కారును తీయ‌డం పెద్ద మ్యాట‌రే కాదు… కాస్త ఇరుకైన ప్రాంతం నుంచి కారు తీయాలంటే మాత్రం క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. కానీ అటు ఇటు అడుగు కూడా ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితుల్లో పార్కింగ్‌లో ఉన్న కారును బ‌య‌ట‌కి తీయాలంటే మాత్రం ధైర్యం ఉండాలి. నైపుణ్యం కావాలి.
  మూడు కార్లు ఒక‌దాని వెన‌క ఒక‌టి పార్క్ చేసి ఉన్నాయి. ఈ మూడు కార్ల మ‌ధ్య గ్యాప్ ఒక్క అడుగు కూడా లేదు. జానెడు మాత్రమే ఉంది. అయితే త‌న కారును బ‌య‌ట‌కి తీసేందుకు ఓ వ్య‌క్తి వ‌చ్చాడు. అటు ఇటూ చూశాడు. ఆ కారుకి, ఈ కారుకి జానెడు గ్యాప్ మాత్ర‌మే ఉంది. రెండో ఆలోచ‌న లేకుండా కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. స్టీరింగ్ ని అటుఇటూ తిప్పుతూ, కొంచెం ముందుకి, కాస్త వెన‌క్కి కారుని పోనిచ్చాడు. క్ష‌ణాల వ్య‌వ‌ధిలోనే ఆ వ్య‌క్తి పార్కింగ్ లో ఉన్న త‌న కారును స‌క్స‌స్ ఫుల్ గా బ‌య‌ట‌కి తీసుకొచ్చాడు. ముందున్న కారుకి, వెన‌కున్న కారుకి ఏమాత్రం త‌గ‌ల‌కుండా జాగ్ర‌త్త‌గా డ్రైవ్ చేస్తూ కారుని బైటికి తెచ్చాడు. అక్క‌డే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావ‌డంతో, అది కాస్తా వైర‌ల్ అయింది. న్యూయార్క్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?