తనకంటే హైట్ ఉన్న భార్యతో సింగర్ హిమేష్ తంటాలు..

  0
  117

  భార్య త‌న కంటే కాస్త ఎత్తుగా ఉంటే ఏ భ‌ర్తకైనా న‌లుగురిలో ఇబ్బందులు త‌ప్ప‌వు. త‌న ఎత్తుని క‌వర్ చేసుకోవ‌డానికి నానా తంటాలు ప‌డాల్సివ‌స్తుంది. బాలీవుడ్ సింగ‌ర్ క‌మ్ యాక్ట‌ర్ హిమేష్ రేష్మియాకు ఈ తంటా త‌ప్ప‌డం లేదు. భార్య సోనియా క‌పూర్ తో క‌లిసి ముంబై ఎయిర్ పోర్టులో ప్ర‌త్యక్ష‌మ‌య్యాడు హిమేష్. కారు దిగీదిగ‌గానే ఫోటోగ్రాఫ‌ర్లు, మీడియా వాళ్ళంతా క‌వ‌రేజీ కోసం ఎగ‌బ‌డ్డారు. దీంతో సోనియా వాళ్ళ‌కి ఫోజులిస్తూ నిల్చుంది. ఆ ప‌క్క‌నే ఉన్న హిమేష్ కూడా రెడీ అయిపోయాడు.

  అయితే సోనియా కంటే హిమేష్ కాస్త హైట్ త‌క్కువ కావ‌డంతో… భార్య‌తో స‌రితూగేలా కాళ్ళ మ‌డిమ‌ల మీద నిల‌బ‌డి ఫోటోల‌కు ఫోజులిచ్చేందుకు య‌త్నించాడు. ఆయ‌న ప‌డుతున్న బాధ‌లు మాట‌ల్లో చెప్ప‌న‌ల‌వి కావు. ఈ ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో రావ‌డంతో… నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. హాలీవుడ్ జంట‌లు టామ్ క్రూజ్-నికోల్ కిడ్మ‌న్‌, టామ్ హాలండ్-జెడ్మ‌యా కూడా మీలాగేనంటూ ఉద‌హ‌రిస్తున్నారు. ఎత్తులో స‌రి చూడ‌డం త‌గ‌దంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..