జేబులు కొడుతూ చిక్కిపోయిన సినీ నటి రూపాదత్ ..

  0
  159

  బెంగాలీ బ్యూటీ రూపాదత్తా దొంగ‌త‌నం చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది. కోల్ క‌త్తాలో జ‌రుగుతున్న ఇంటర్నేష‌న‌ల్ బుక్ ఫెయిర్ కి వెళ్ళిన ఆమె… పిట్ పాకెట్ చేస్తూ దొరికిపోయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ‌తంలోనూ జ‌న‌స‌మ్మ‌ర్ధంగా ఉండే ప్రాంతాల్లో ఆమె పిట్ పాకెటింగ్ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. దొంగ‌త‌నం చేసిన సంద‌ర్భంలో ఆమె ఈ విష‌యాల‌న్నీ ఒక డైరీలో రాసి పెట్టుకోవ‌డం విశేషం.

   

  దొంగ‌త‌నం చేసిన అనంత‌రం ప‌ర్సులు, వ్యాలెట్లు, బ్యాగులు ఆమె ఇంటి ప‌రిస‌రాల్లో క‌నిపిస్తుండ‌డంతో పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి కూపీ లాగడంతో రూపాద‌త్తా భాగోతం బ‌య‌ట‌ప‌డింది. ప‌లు బాలీవుడ్ చిత్రాలతో పాటు టాలీవుడ్ లోనూ అడ‌పాద‌డ‌పా చిత్రాల్లో న‌టించింది. ఇక‌పోతే, ఈమె బాలీవుడ్ డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ పై లైంగిక ఆరోప‌ణ‌లు చేసి అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. సోష‌ల్ మీడియాలో అనురాగ్ త‌న‌తో అస‌భ్య‌క‌రంగా చాటింగ్ చేశాడ‌ని, వేధింపుల‌కు గురి చేశాడ‌ని ఆరోపించింది. అయితే ఆ త‌ర్వాత చాటింగ్ చేసి వ్య‌క్తి డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ కాద‌ని, అదే పేరుతో ఉన్న మ‌రొక‌ర‌ని తేలింది.

   

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..