భార్య మటన్ కర్రీ చేయలేదని…

  0
  301

  భార్య మటన్ కర్రీ చేయలేదని , పోలీసులకు ఫోన్ చేస్తే , పోలీసులు ఎత్తుకుపోయి జైల్లో పెట్టి కేసుపెట్టారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం చర్లగౌరారం గ్రామంలో జరిగిందీ ఘటన.. నవీన్ అనే వ్యక్తి , శుక్రవారం రోజు రాత్రి , మాంసం తీసుకొని ఇంటికొచ్చాడు, మద్యం తాగి ఉన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో భార్యకు మటన్ ఇచ్చి , కూర వండమన్నాడు. వంట అయిపోయిందని , ఇప్పుడు చేయలేనని , రేపు చేస్తానని చెప్పింది.

  భార్యపై చిర్రుబుర్రులాడిన నవీన్ , 100 కి కాల్ చేసాడు. తన భార్య మటన్ కర్రీ చేయడంలేదని ఫిర్యాదు చేసాడు. మొదట్లో దాన్ని పెద్దగా పట్టించుకోని పోలీసులకు , పదేపదే నవీన్ 100 కి కాల్ చేసి , పోలీసులొచ్చి , తన భార్య చేత కూర వండించాలని చెప్పాడు. మళ్ళీ , మళ్ళీ వదలకుండా 100 కి కాల్ చేస్తున్న నవీన్ ని , పోలీసులొచ్చి కస్టడీలోకి తీసుకొని , న్యూసెన్స్ కేసుపెట్టి , బుద్ధిచెప్పి ఇంటికి పంపించారు..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..