నీకోసం నేను.. ఇద్దరు హిజ్రాల ఆత్మహత్య..

  0
  2245

  ప్రేమంటే ఆడ-మగ మధ్యే కాదు. హిజ్రాల మధ్య కూడా ప్రేమ, అనురాగాలుంటాయి. దానికి ఉదాహరణే హిజ్రాలు అనన్య, జిజురాజు ఆత్మహత్య.
  తన జీవిత భాగస్వామి హిజ్రా అనన్య ఆత్మహత్యతో ప్రియుడు జిజురాజు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళకు చెందిన తొలి ట్రాన్స్ జెండర్ రేడియో జాకీగా అనన్య బాగా ఫేమస్. ఆమె 4 నెలల క్రితం సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. మహిళగా జననేంద్రియాలను అమర్చుకోవాలని కోరుకుంది. అయితే ఆపరేషన్ లో జరిగిన పొరపాటు వల్ల ఆమెకు మహిళ జననేంద్రియాల బదులు, ఒక మాంసం ముద్దలా అక్కడ చేసి పెట్టారని కుమిలిపోయింది. ఇటీవల ఈ విషయమై హైకోర్టులో కూడా కేసు వేసింది. మహిళగా మారాలన్న తన జీవితాన్ని నాశనం చేశారని, మర్మాంగం ఆపరేషన్ లో దాన్ని స్త్రీల మర్మాంగం లాగా ఒక మాంసం ముద్దలా చేసి తనను మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో గత కొంతకాలంగా తన అపార్ట్ మెంట్ లో ఒక్కతే ఉంటూ కుమిలిపోయింది. ఆపరేషన్లో ఆరోగ్యం కూడా క్షీణించింది. తనతో భాగస్వామిగా ఉన్న జిజురాజు కూడా కొచ్చిన్ లోని ఆమె వద్దకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు. అనన్యతోనే ఉండి ఆమెకు సపర్యలు చేస్తున్నాడు. అయితే అనన్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత జిజురాజు కూడా మానసికంగా క్షోభకు గురయ్యాడు. అనన్య లింగమార్పిడికోసం ఆరు దఫాలు సర్జరీలు చేయించుకుంది. ఏ సర్జరీలోనూ ఆమెకు అనుకున్న విధంగా అవయవాలు కుదరలేదు. ఈ డిప్రెషన్ లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. హిజ్రా స్నేహితురాలి ఆత్మహత్యతో జిజురాజు కూడా తీవ్రమైన క్షోభకు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలోనే ఉరేసుకుని చనిపోయాడు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?