డ్రగ్స్ ఇస్తారు, వాడుకుంటారు..

  0
  11966

  సినిమాల్లోకి కొత్తగా వచ్చే అమ్మాయిలు, మోడల్స్ కు డ్రగ్స్ అలవాటు చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, వాళ్లతో అసభ్యంగా వీడియోలు తీయడం, సెక్స్ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం, ఇవన్నీ సర్వ సాధారణంగా జరిగే విషయాలేనని శృతి గెరా అనే నటి బాంబ్ పేల్చింది. చాలామంది వీటిని చెప్పుకోలేక దాచుకుంటున్నారని, కొంతమంది వాటికి అలవాటుపడిపోయి ఆ తర్వాత ఇష్టపడే ఆయా పనుల్ని చేస్తున్నారని రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల అరెస్ట్ నేపథ్యంలో శృతి గెరా ఇలా సంచలన విషయాలను వెళ్లడించింది. తనను కూడా చాలామంది అలాగే సంప్రదించారని, క్యాస్టింగ్ కౌచ్ అనేది కొత్తేమీ కాదని చెప్పింది. చాలామంది తనని రాజ్ కుంద్రాకు పరిచయం చేస్తానని చెప్పి ముందుకొచ్చారని, అయితే అప్పటికే తాను అన్నీ తెలుసుకొని ఉండటం వల్ల తాను అక్కడికి పోలేదని చెప్పింది.

  ఆయనేదో పెద్ద హీరోయిన్ భర్త అని, కోటీశ్వరుడని అందరూ భావిస్తారని, అయితే ఆయన పోర్న్ ఫిల్మ్ లు తీసుకునే ఒక నీఛ మనస్తత్వం కలవాడని ఇప్పుడు ప్రపంచానికి తెలిసిందని అన్నారు. తనకీ విషయం ఎప్పుడో తెలుసని అన్నారు. కొత్తగా వచ్చే యాక్టర్లు, మోడల్స్ ని తిట్టాల్సిన అవసరం లేదని, ఇప్పుడు సీనియర్లు అనుకుంటున్నవారు, గతంలో ఏం చేశారో కూడా గుర్తుంచుకుంటే మంచిదని సలహా చెప్పింది. తాను కొన్ని వందల టీవీ కమర్షియల్ షో లు చేశానని, పెద్ద సంస్థలకు మోడలింగ్ చేశానని, చెప్పింది.

  కొత్త తారలతో ఇలా పోర్న్ వీడియోలు చేసి, ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి ఆ ఊబిలోనుంచి బయటకు రాకుండా చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పింది. ఇలాంటి యాక్టర్లను ఉపయోగించి మళ్లీ కొత్తవారిని కూడా ఇదే ఊబిలోకి లాగుతున్నారని తెలిపింది. కొత్తగా వచ్చే మగవారికి కూడా ఇలాంటి బాధలు తప్పడంలేదని హనీ ట్రాప్ అనేది సినిమా ఇండస్ట్రీలో సహజంగా ఉండేదేనని చెప్పింది. గదుల్లో, బాత్రూమ్ లలో కూడా కెమెరాలు పెట్టి వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపించింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?