పెళ్లి మండపాల్లో పెళ్లి కూతుళ్లు , పెళ్లికొడుకులకు ఇచ్చే షాక్ లు మామూలుగా ఉండటం లేదు .. తాజాగా ఒరిస్సాలోని బాలాసోర్ లో పెళ్లి కూతురు పెళ్లి జరుగుతుండగానే , గాజులు తీసి విసిరేసింది . అక్కడ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతున్న సమయంలో గాజులు తీసి వేస్తే పెళ్ళికొడుకు చనిపోయినట్టే.. పెళ్లి పెళ్లి కూతురుకు ఇష్టం లేదన్న అభిప్రాయాన్ని కూడా సూచిస్తుంది .
బాలాసోర్ జిల్లా రేమో అనే గ్రామంలో కుమార్ అనే పెళ్ళికొడుకు అంగ రంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు కదిలి వచ్చాడు.. పెళ్లి తంతు జరుగుతొంది.. పెళ్ళికొడుకు , పెళ్లికూతురు మెడలో తాళి కట్టాల్సిఉంది.. అదే సమయంలో పెళ్లి కూతురు చేతికున్న గాజులు తీసి విసిరేసింది. దీంతో అంతా ఆశ్చర్యపోయారు పోయారు.
తల్లిదండ్రులు ఆమెకు ఎంత చెప్పినా వినకుండా తనకు పెళ్లి ఇష్టం లేదని గొడవ చేసింది. ఆ యువతి తల్లిదండ్రులు , బంధువులు ఎంత చెప్పినా మనసు మారలేదు .., పెళ్లి వద్దని గాజులు విసిరి వేయడంతోనే పెళ్లికొడుకు స్పృహ తప్పి పడిపోయాడు..తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లారు.. కోలుకున్న తరువాత , పెళ్లి రద్దు చేసుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు..