జిమ్ లో ఆమె మరణంపై తేలిన సంచలన నిజం..

  0
  1902

  ఫిజిక‌ల్ ఫిట్ కోసం ఎంతోమంది జిమ్ ల‌కు వెళుతుంటారు. అయితే ఇటీవ‌లికాలంలో జిమ్ చేస్తూ మృత్యువాత ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే ప‌రిణామం. గ‌తేడాది క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికీ అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాగా ఇటీవ‌ల బెంగుళూరులో 44 ఏళ్ళ మహిళ జిమ్‌లో వర్కౌట్స్​ చేస్తూ ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆమె వ్యాయామం చేస్తున్న సమయంలోనే హార్ట్​ ఎటాక్ రావడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు కూడా చేప‌ట్టారు.

   

  అయితే అస‌లు ఆమె హార్ట్ ఎటాక్ తోనే చ‌నిపోయిందా లేక మ‌రేదైనా కార‌ణముందా అనే కోణంలో విచారించారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం ఆమె గుండెపోటుతో చ‌నిపోలేద‌ని తేలింది. వ్యాయాయం చేస్తున్న స‌మ‌యంలో ఆమెకు బీపీ ఎక్కువైపోయి మెద‌డులో ర‌క్త‌నాళం చిట్లి, తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగి మృత్యువాత ప‌డింద‌ని నిర్ధార‌ణ అయింది.ఇటీవ‌లి కాలంలో జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ చ‌నిపోతున్న వారి సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం.

  ముఖ్యంగా 35 నుంచి 50 ఏళ్ళ మ‌ధ్య వ‌య‌సులోపు వారే ప్రాణాలు కోల్పోతున్నార‌నేది ఎక్కువగా కనిపిస్తోంది. మితిమీరి వ్యాయాయం చేయ‌డం… పెద్ద‌పెద్ద బ‌రువులు ఎత్తడం.. గ్యాప్ లేకుండా వ‌ర్క‌వుట్స్ చేస్తుండ‌డం కార‌ణాలు కావ‌చ్చు. ఆరోగ్య‌ప‌రంగా స‌మ‌స్య‌లున్నవారు డాక్ట‌ర్ల స‌ల‌హ‌లు, సూచ‌న‌లు తీసుకోకుండా చేయ‌క‌పోవ‌డం కూడా మ‌రో కార‌ణ‌మై ఉండ‌చ్చు. ఏదేమైనా ఎక్స‌ర్ సైజులు చేసే వారు జిమ్ ట్రైన‌ర్ల స‌ల‌హాల‌తో పాటు ముఖ్యంగా డాక్ట‌ర్ల స‌ల‌హాలు తీసుకోవ‌డం ఉత్త‌మం అని నిపుణులు చెబుతున్న‌మాట‌.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..