హిద్మా. ఇతడే జవాన్లను చంపిన దళ నాయకుడు.

  0
  1381

  ఛ‌త్తీస్ ఘ‌డ్ రాష్ట్రం బ‌స్త‌ర్ ప్రాంతంలోని దండ‌కార‌ణ్యం ర‌క్త‌మోడింది. దాదాపు 26 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌ను న‌క్స‌లైట్లు పొంచి చంపేశారు. ఇప్పుడు దండ‌కార‌ణ్యాన్ని భ‌ద్ర‌తాద‌ళాలు చుట్టుముట్టేశాయి. అస‌లు ఈ దాడి ఎందుకు జ‌రిగిందో ఇప్ప‌డు బ‌య‌ట‌ప‌డింది. న‌క్స‌లైట్ల‌లో అతి చిన్న వ‌య‌సులోనే అగ్ర‌స్థానానికి ఎదిగిన హిద్మా త‌న అనుచ‌రుల‌తో ఒక ప్రాంతంలో మ‌కాం వేశాడ‌ని తెలిసి, దాదాపు 1500 మంది సీఆర్పీఎఫ్‌, రిజ‌ర్వ్ పోలీసులు అడ‌విని చుట్టుముట్టారు. పీపుల్స్ లిబ‌రేష‌న్ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా ఉన్న హిద్మా 36ఏళ్ళ వ‌య‌సులోనే పీపుల్స్ వార్ సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్ కూడా అయ్యారు. గిరిజ‌న తెగ‌కు చెందిన హిద్మాకు అడ‌వుల‌న్నీ కొట్టిన పిండి. కొండ‌లు, కోన‌లు ఆయ‌నకు చిన్న‌నాటి నుండి ప‌రిచ‌య‌మే. హిద్మా ఇప్పుడు భ‌ద్ర‌తాద‌ళాల‌కు పెద్ద స‌వాలుగా మారాడు. హిద్మాను అంతం చేయాల‌నే ఉద్దేశ్యంతో భ‌ద్ర‌తాద‌ళాలు అడ‌విని చుట్టుముట్టినా, అంత‌కంటే ప‌టిష్ట‌మైన వ్యూహంతో హిద్మా బృందం 26 మంది జ‌వాన్ల‌ను చంపివేసింది. సుక్మా-బీజాపూర్ స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఈ పోరాటంలో 31 మంది వ‌ర‌కు గాయ‌ప‌డ్డారు. న‌క్స‌లైట్ల‌కి సంబంధించి ఒక్క మ‌హిళ మృత‌దేహ‌మే దొరికింది. మ‌రో ఐదుగురు భ‌ద్ర‌తాద‌ళాల‌కు చెందిన ఐదు మంది మృత‌దేహాల‌ను క‌నుగొనాల్సి ఉంది. ఇటీవ‌లికాలంలో ఎన్న‌డూ లేనంత‌మంది జ‌వాన్లు న‌క్సలైట్ల చేతిలో హ‌త‌మ‌వ‌డంతో కేంద్రం కూడా సీరియ‌స్ గా తీసుకుంది. సీఆర్పీఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ను అత్య‌వ‌స‌రంగా ఛ‌త్తీస్ ఘ‌డ్ కి పంపించింది. భ‌ద్ర‌తాద‌ళాల‌పై యూబీజీఎల్ రాకెట్ లాంఛ‌ర్లు, తేలిక‌ర‌కం మిషిన్ గ‌న్ల‌తో న‌క్స‌లైట్లు దాడి చేశార‌ని స‌మాచారం.

   

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు