ఆ నక్సలైట్లు ఏపీలోకి రాకుండా..

  0
  553

  చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నక్సలైట్ల నరమేథం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మన రాష్ట్రం, తెలంగాణ సరిహద్దుల్లో బస్తర్ ఉంది. ఒడిశా సరిహద్దు కూడా మన రాష్ట్రాన్నే ఆనుకుని ఉండటంతో భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. సంఘటన జరిగిన బీజాపూర్, సుక్మా సరిహద్దులనుంచి నక్సలైట్లు మన రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. 26మంది జవాన్లను దారుణంగా హతమార్చిన నక్సలైట్లకోసం అతి పెద్ద స్థాయిలో దండకారణ్యంలో వేట మొదలైంది.

  భద్రతా దళాల వేటనుంచి తప్పించుకునేందుకు నక్సలైట్లు దండకారణ్యం నుంచి మన రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రా, ఒడిశా సరిహద్దులు, ఆంధ్రా చత్తీస్ ఘడ్ సరిహద్దులు, ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో నిఘా ముమ్మరం చేశారు. నక్సలైట్లు మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా దళాలపై దాదాపు 500మంది నక్సలైట్ల బృందం దాడి చేసి పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మన రాష్ట్రంలో సరిహద్దు జిల్లాలు మరియు నక్సల్స్ హిట్ లిస్ట్ లో ఉన్న నేతలకు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆంధ్ర, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భద్రతను ముమ్మరం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. సరిహద్దుల్లో నక్సల్స్ కోసం గాలింపు ముమ్మరం చేశామని, పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.

  ఇవీ చదవండి

  ఆమె వేధింపులతో యువకుడు ఆత్మహత్య..

  నూటికో, కోటికో ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే..

  మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

  సినిమాలో సీన్ కాదు.. కాశీలో పుర్రెల మాలతో అఘోరాల హోలీ సంబరాలు