అభిమానులకు షాకిచ్చిన హీరోయిన్ ప్రణీత..

    0
    69

    హీరోయిన్ ప్రణీత తన అభిమానులకు సడన్ గా షాకిచ్చింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్‌ రాజుని పెళ్లి చేసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అతి తక్కువమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తాజాగా ప్రణీత-నితిన్‌ల వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

    కన్నడ పోకిరి రీమేక్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ కన్నడ కస్తూరి. తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’, ‘బావ’ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ‘అత్తారింటికి దారేది’, ‘రభస’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘బ్రహ్మోత్సవం’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాలు నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ప్రణీత బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ‘హంగామా-2’లో నటిస్తోంది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల కోసం, అన్నార్తుల కోసం తనవంతు సాయం చేశారు. స్వయంగా ఆహారం తయారు చేసి అందిస్తూ అందరి మనసును గెలుచుకుంది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..