ట్రాక్టర్ డ్రైవింగ్ కి హెల్మెట్ ఉండాలా..?

  0
  251

  ఒక్కోసారి మన పోలీసు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి..హెల్మెట్ లేదని టూ వీలర్ రైడర్ కి ఫైన్ వేస్తే రూల్ కదా అని అనుకోవచ్చు. అయితే మన పోలీసులు ట్రాక్టర్ డ్రైవింగ్ కి కూడా హెల్మెట్ లేదని ఫైన్ వేస్తే ఎలా..? వాళ్ళ తలలో మెదడు ఉందా ..? లేదా అది మట్టి ముద్దా అన్న అనుమానం వస్తోంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం చించొల్లి గ్రామానికి చెందిన సతీష్‌కు ట్రాక్టర్‌ ఉంది. ఆయన హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ డ్రైవ్ చేశాడని 1,035 రూపాయలు చలానా ఆన్‌లైన్‌లో ఆయన మొబైల్ కి మెస్సేజ్ వచ్చింది.

  ఏపీ25ఏఆర్‌4194 గల వాహనం ఫిబ్రవరి 25న మండలంలోని మద్దికుంటమర్రి ఎక్స్‌రోడ్డులో హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపారని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొత్తం రూ.1,035 చలానా మీ-సేవలో చెల్లించాలని సతీష్‌ కి మెస్సేజ్ వచ్చింది. . 2019 నుంచి ఇలా మూడుసార్లు చలానాలు వేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?