సినిమా తీశారా.. చుట్టేశారా..?

  0
  136

  పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాని హడావిడిగా చుట్టేశారని ఈపాటికే ఆరోపణలున్నాయి. ఈరోజు విడుదలైన సత్యమేవ జయతే పాట ఆ ఆరోపణని నిజం చేసేలా కనిపిస్తోంది.

  కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ వరుసగా మిగతా సినిమాలు ఒప్పుకున్నారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలంటూ ఆయన కాస్త ఇబ్బంది పడిన మాట వాస్తవమే. దానికి తగ్గట్టే సినిమాని హడావిడిగా ముగించేశారని అంటున్నారు. కాల్షీట్లు అడ్జస్ట్ చేసి మరీ ఆ సినిమాని చుట్టేశారట. అందులోనూ పవన్ రెండోటేక్ లేకుండానే, తొలి టేక్ కే షాట్ ఓకే అని అనేశారని కూడా ఓ ప్రచారం జరిగింది.

  వకీల్ సాబ్ కి సంబంధించి మగువా ఓ మగువా అంటూ గతంలో లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఇప్పుడు సత్యమేవ జయతే అంటూ మరో లిరికల్ సాంగ్ వదిలారు. ఇందులో పవన్ కల్యాణ్ కి సంబంధించిన కొత్త ఫొటోలు ఒకటో రెండో బయయటకు వదిలారంతే.

  మిగతావన్నీ పాత ఫొటోలే. వాటితోనే మేనేజ్ చేశారు. ఆ ఫొటోల క్వాలిటీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ పాట అభిమానుల్ని ఆకట్టుకుంటుందా, లేదా అనే విషయం పక్కనపెడితే.. క్వాలిటీ మాత్రం నిరాశపరిచిందనే చెప్పాలి.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..