అక్రమసంబంధం ఉంటే ఉద్యోగం తీసేస్తారా..? ఎక్కడుంది ఆ రూల్.. ?

    0
    255

    అక్రమ సంబంధం ఉందన్న కారణంగా ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడం, లేదా తొలగించడం చట్ట విరుద్ధమని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. వివాహేతర సంబంధం లేదా, అక్రమ సంబంధం, సమాజం దృష్టిలో అనైతికమైన చర్యే అయినప్పటికీ, దాన్ని దుష్ప్రవర్తనగా భావించకూడదని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం కారణంగా ఉద్యోగం నుంచి తొలగించిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కు ఉద్యోగంలోనుంచి తీసివేసిన 9 సంవత్సరాలకు జీతం కూడా చెల్లించి, కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది. పోలీస్ సర్వీస్ రూల్స్ లో దుష్ప్రవర్తన అన్న పదమే ఉంటంది తప్ప, అనైతికత కారణంగా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది.

    వివాహేతర సంబంధం అనైతిక చర్యే తప్ప, దుష్ప్రవర్తన కాదని బావించాలని చెప్పింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ కు ఒక వితంతువుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు అంది, ఉద్యోగం నుంచి తొలగించారు. అది అతని వ్యక్తిగత విషయమే తప్ప పోలీస్ గా ఆయన విధి నిర్వహణలో లేదా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేది కాదని, స్పష్టం చేశారు. వాళ్లిద్దరూ ఇష్టపడి సహజీవనం చేస్తున్నప్పుడు దానిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం పోలీస్ శాఖకు ఏమిటని కూడా ప్రశ్నించింది. ఆ మహిళ కూడా అభ్యంతరం చెప్పలేదని, విధి నిర్వహణలోనూ, వృత్తిపరంగానూ ఆయన ఎటువంటి పొరపాటు చేయలేదని పేర్కొంది. వితంతువు కుటుంబానికి సంబంధించినవారు ఫిర్యాదు చేశారన్న ఒకే ఒక్క కారణంపై ఉద్యోగం నుంచి తొలగించడం, మంచి పద్ధతి కాదని, చెప్పింది.

     

    ఇవీ చదవండి… 

    బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

    మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

    నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

    తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..