ఇటీవలికాలంలో పెళ్ళిళ్ళలో రకరకాల జోకులు, వికృత చేష్టలు, సంప్రదాయానికి తిలోదకాలిచ్చే కుప్పిగంతులు.. వీటన్నింటి మధ్య ఇప్పుడో పెళ్ళికొడుకు ఏకంగా పెళ్ళయిన తర్వాత భార్య కాళ్ళకు దండం పెట్టి ఆశీస్సులు ఇవ్వాలని కోరాడు. సాధారణంగా పెళ్ళయిన తర్వాత సంప్రదాయంగా భర్తకు, తల్లిదండ్రులకు, అత్తమామలకు భార్య ఆశీస్సులు ఇస్తుంటుంది. అయితే పెళ్ళి చేసిన పూజారి.. భర్త ఆశీస్సులు తీసుకోమని చెప్పడంతో భార్య ఆశీస్సులు తీసుకుంది. ఆ తర్వాత భర్త కూడా భార్య కాళ్ళకు దండం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. బహుశా భవిష్యత్తులో భార్య వేధింపులకు గురి చేయొద్దని సింబాలిక్ గా ఇప్పుడే కాళ్ళకు దండం పెట్టినట్లు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
View this post on Instagram