పెళ్లికొడుక్కి బై అనిచెప్పి లవర్ తో తుర్రు..

  0
  586

  కొత్తగా పెళ్ళైన జంట , షాపింగ్ కి వెళ్ళింది.. అక్కడ పెళ్లికూతురు మాజీ లవర్ కనపడ్డాడు.. అంతే భర్తను వదిలేసి , ప్రియుడితో కారులో వెళ్ళిపోయింది. పెళ్ళికొడుకు కారు వెనక పరుగుతీసినా , బై , బై అంటూ చేతులూపుతూ వెళ్లిపోవడంతో , అమాయకుడైన మొగుడు పోలీస్ స్టేషన్ కెళ్ళి ఫిర్యాదు చేసాడు.. పోలీసులు ఇద్దరినీ పట్టుకొచ్చి , చీటింగ్ కేసుపెట్టి , విచారిస్తున్నారు. . బీహార్ లోని ముంగర్ లో ఈ నెల 14 న పెళ్ళిజరిగింది.

  18 తేదీన పెళ్లికూతురు అత్తగారింటికి వచ్చింది. 21 వతేదీన , భర్తను గాజులు కొనివ్వమని అడిగింది.. ముందుగా ప్లాన్ ప్రకారం , ఓ షాపుకు తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ ప్రియుడు కారులో వెయిటింగ్ లో ఉన్నాడు. భర్తతో , ఆటో దిగిన పెళ్లికూతురు , అతడికళ్ల ముందే , ప్రియుడి కారు ఎక్కేసింది.. ముందుగా , పెళ్ళికి పెట్టిన నగలన్నీ వేసుకొచ్చింది.

  ఇన్ని నగలు ఎందుకంటే , మ్యాచింగ్ గాజులు సెలెక్షన్ కోసమని చెప్పింది. సిసి కెమెరాల ఆధారంగా , పోలీసులు , ఈ చీటింగ్ పెళ్లికూతురిని పట్టేశారు. ప్రియుడితో సహా ఇద్దరిపై కేసులుపెట్టి విచారిస్తున్నారు. తామిద్దరూ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నామని వారు చెప్పారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేశారని , అందుకే , ప్రియుడితోనే ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.