ఓ తల్లి ,ఇద్దరు కూతుళ్లు ,బ్లాక్ మెయిలింగ్.

    0
    225

    ఇద్దరు కూతుళ్లతో , ఓ తల్లి రేప్ కేసుల వ్యాపారం జోరుగా చేస్తోంది. తప్పుడు రేప్ కేసులుపెట్టి , లక్షల్లో డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్న , తల్లిని , కూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గురుగ్రామ్ లో ఓ వ్యాపారవేత్తను , తప్పుడు రేప్ కేసులో ఇరికించి , 50 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. ఈ వ్యాపారవేత్త తమ్ముడు , పరిస్థితి గమనించి , పక్కాగా ప్లాన్ చేసాడు. డబ్బులు ఇస్తానని నమ్మించి , ముందుగా కొంత అడ్వాన్స్ ఇస్తాన్ననాడు .

    తాను ఇవ్వబోయే డబ్బులు , కరెన్సీ నోట్ల నంబర్లు , అన్నీ పోలీసులదగ్గర ఇచ్చాడు. పోలీసులు కూడా , డబ్బులు ఇస్తానన్న రెస్టారెంట్ దగ్గర మాటువేశారు. అమ్మ , కూతుళ్లు , వచ్చి డబ్బులు తీసుకోవడంతోనే , పోలీసులు అరెస్ట్ చేశారు.

    గతంలో కూడా తల్లి , కూతుళ్లు ఇలాగే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది తప్పుడు రేప్ కేసులు పెట్టి , బ్లాక్ మెయిల్ చేసి , లక్షలు గుంజారు. ఇంతకాలానికి వీళ్ళ పాపం పండి చిక్కిపోయారు. ఈ మహిళకు , 19 , 17 ఏళ్ళ కూతుళ్లు ఉన్నారు. వీళ్ళను అడ్డంపెట్టుకునే రెండేళ్లలో దాదాపు 70 లక్షలు సంపాదించిందట .. వీళ్లకు సంబందించిన కేసును , మహిళా పోలీసు అధికారి సుమన్ కుమారి విచారిస్తున్నారు.

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.