ఇది జాతీయ రహదారి అంటే నమ్మడం కష్టం. ఇదే జాతీయ రహదారి అని విదేశాల్లో చెప్తే.. భారతదేశం తలదించుకోవాల్సిన పరిస్థితి. అయితే మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఇది జాతీయ రహదారే. ఇంత దౌర్భాగ్య స్థితిలో కనిపిస్తోన్న హైవే..
మధుబని ప్రాంతంలోని 227 నెంబర్ జాతీయ రహదారి. చూసినంత మేర స్విమ్మింగ్ పూల్స్ లాగా ఉన్న రోడ్డు అనడం కూడా .. రోడ్లకే అవమానం. ఇంత అద్వాన్నమైన జాతీయ రహదారి మనదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేదు.
రోడ్లలో గుంటలు ఉండడం సహజమే. గతుకులు, గుంతలు ఉండడం కూడా సహజమే. అయితే ఒక జాతీయ రహదారిలో 27 కి.మీ దూరం స్విమ్మింగ్ ఫూల్స్ ను తలదన్నే గోతులు ఉండడం విచిత్రం. ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి ఓ సందర్భంగా మాట్లాడుతూ అందమైన బీహార్ రోడ్ల గురించి అందరికీ చెప్పండని కోరడంతో…
ఇప్పుడు ఈ రోడ్ల గురించి బీహార్ వాసులే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మారోడ్డు-మారాష్ట్రం అంటూ కొత్తగా ఓ క్యాప్షన్ పెట్టి బీహార్ రోడ్లు ఇలా ఉన్నాయంటే బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను ఏకి పారేస్తున్నారు.