క్రిమినల్స్ క్యూ కడుతున్నారు.. యోగి దెబ్బకు అబ్బా అంటున్నారు..

    0
    220

    ఉత్తర ప్రదేశ్ లో యోగి అథిత్యనాధ్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక నేరస్థులు, మాఫియాలు, గూండాలు లొంగిపోయేందుకు క్యూ కడుతున్నారు. కేవలం ఎన్ కౌంటర్ల భయంతోనే వీరందరూ పోలీసు స్టేషన్లకు వచ్చి లొంగి పోతున్నారు. పోలీసు స్టేషన్లలో లొంగి పోయే ముందు కాల్చేస్తారేమోనన్న భయం కూడా ఉండటంతో మెడలో బోర్డులు తగిలించుకోవడం.. మీడియాకు చెప్పి లొంగిపోవడం, మధ్యవర్తుల సమక్షంలో లొంగి పోవడం, అరుస్తూ పోలీసు స్టేషన్లోకి వెళ్లి లొంగి పోవడం వంటివి చేస్తున్నారు.

    ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక యూపీలో నాలుగు పెద్ద ఎన్ కౌంటర్లు జరిగాయి. వీటిలో కరుడుకట్టిన నేరస్థులు హతమయ్యారు. ఈ భయంతోనే మిగిలిన నేరస్థులు కూడా లొంగి పోయేందుకు క్యూ కట్టేశారు. ఒక్క సహరాన్పూర్ లోనే 20 మంది నేరస్థులు లొంగి పోయారు. చిల్ఖానా పోలీసు స్టేషన్ లో 13 మంది, గగల్ హేరీ పోలీస్ స్టేషన్ లో 8 మంది లొంగి పోయారు. ఎన్ కౌంటర్లో చంపేస్తారనే భయంతోనే వీరందరూ లొంగి పోతున్నారు.

    లొంగి పోయాక ఇక మేమెప్పుడూ నేరాలు చేయబోమని హామీ పత్రాలు కూడా రాసిస్తున్నారు. ఒక్క సోమవారం రోజునే మనీష్ సింగ్ సోనూ అనే కరుడుకట్టిన నేరస్థుడిని వారణాసిలో పోలీసులు పట్టపగలే చంపేశారు. ఇతడిని పట్టించినా.. ఆచూకీ తెలిపినా రెండు లక్షల రివార్డ్ కూడా ఉంది. 12 హత్య కేసుల్లో ఇతడు నిందితుడు. హత్య, కిడ్నాప్, వంటి కేసుల్లో ఇతను తప్పించుకు తిరుగుతున్నాడు. మొత్తానికి యోగీ భయంతో క్రిమినల్స్ అందరూ ఇలా వరుసగా లొంగిపోవడం మాత్రం విశేషమే..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..