శ్రీవారి భక్తులకు రేపటినుంచి సర్వదర్శనాలు

    0
    296

    తిరుమలలో రేపటినుంచి సర్వ దర్శనాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈమేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. అయితే తొలి విడతలో కేవలం చిత్తూరు జిల్లా వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని అంటున్నారు. ఎట్టకేలకు 6 నెలలుగా ఆగిపోయిన శ్రీవారి సర్వదర్శనం.. ఇప్పుడు తిరిగి మొదలు కాబోతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దేవస్థానం సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపి వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెన్లను మాత్రమే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తోంది. చాలా రోజులుగా సామాన్య భక్తులు స్వామి వారి దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని కోరుతూ వస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇవీ చదవండి..

    రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

    ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్