తాళిబొట్టుతో భర్తను చంపిన మహా పతివ్రత..

  0
  1103

  భర్త ఉన్నన్ని రోజులు మహిళలు తాళిని మెడలో వేసుకుంటారు. మెడలో తాళి లేదంటే.. దానర్థం భర్త చనిపోయాడని. అయితే భర్తను చంపేందుకే ఆ తాళిని మెడలోనుంచి తీసింది ఆ ఇల్లాలు. తాళిని అమ్మగా వచ్చిన సొమ్ముతో సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది. చివరకు పోలీసుల చేతికి చిక్కింది. మహారాష్ట్రలోని భివాండీలో ఈ ఘటన జరిగింది.

  ప్రభాకర్, శృతి భార్యా భర్తలు. అయితే శృతికి హితేష్ వాలా అనే లవర్ ఉన్నాడు. అతడితో వెళ్లిపోయేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న శృతి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. గతంలో భర్తను చంపి ప్రియుడితో హ్యాపీగా ఉంటున్న ప్రియ అనే స్నేహితురాలి సలహా కోరింది. ఆమె సూచన మేరకు సుపారీ కిల్లర్ సంతోష్ రెడ్డి సాయం తీసుకుంది. సంతోష్ రెడ్డి మెల్లగా ప్రభాకర్ తో పరిచయం పెంచుకుని ఓరోజు కారులో వెళ్తూ అతడ్ని చంపేశాడు. ఆ తర్వాత పోలీసు విచారణలో అసలు విషయం బయటపడింది.

  సంతోష్ రెడ్డికి సుపారీ ఇచ్చేందుకు తన మంగళసూత్రం అమ్మేసింది శృతి. దానితోపాటు ఫిక్స్ డ్ డిపాజిట్లను క్యాష్ గా మార్చి మొత్తం 4 లక్షల రూపాయలు ముట్టజెప్పింది. స్నేహితురాలు ప్రియ సలహాతో ఈ పని చేశానని చెప్పింది శృతి.

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్