భారత జవాన్లకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

  0
  54

  భారత జవాన్లకు గతంలో ఏడాదికి 60నుంచి 65రోజులపాటు సెలవలు లభించేవి. అయితే కేంద్ర ప్రభుత్వం వాటిని ఏడాదికి 100రోజులకు పెంచాలనే ఆలోచనలో ఉంది. గతంలోనే ఈ ప్రతిపాదన ఉన్నా.. ఇప్పుడది కార్యరూపం దాలుస్తోంది. ఏడాదిలో కనీసం 100 రోజులు తమ కుటుంబంతో గడిపేందుకు జవాన్లకు అనుమతించాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదన త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సెలవులకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పాలసీ అమలులో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే హోం శాఖ పలుమార్లు చర్చలు జరిపింది. ఈ నెల ప్రారంభంలోనూ సమావేశమైంది. జవాన్లపై పని ఒత్తిడి తగ్గించడం, అత్యంత సవాలుగా ఉన్న పలు ప్రాంతాల్లో కష్టతరమైన విధులను నిర్వహించే సుమారు 10 లక్షల మంది సైనికుల జీవితాల్లో ఆనందాన్ని నింపడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం.

  100 రోజుల సెలవులను ఎలా అమలు చేయాలనే దానిపై హోం మంత్రిత్వ శాఖ వచ్చే నెలలో తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని సీఏపీఎఫ్‌ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ విధానాన్ని ఎప్పుడో అమల్లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ.. కరోనా కారణంగా సమస్యలు తలెత్తినట్లు ఆయన వెల్లడించారు. జవాన్ల 100 రోజుల సెలవుల సమయంలో విధులకు ఆటంకం కలగకుండా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం, మహమ్మారి సంక్రమణను అరికట్టడం పైనా కేంద్రం దృష్టిసారించినట్లు ఆ అధికారి వివరించారు.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..