బంగారం స్పానర్లకు కోటింగ్ వేసాడు..

  0
  469

  విదేశాల నుంచి బంగారం స్మ‌గ్లింగ్ చేయడంలో ఎన్ని ర‌కాల మాయోపాయాలు ఉంటాయో… అన్నీ వాడేస్తుంటారు. గుండీల రూపంలో బంగారం త‌యారు చేసుకుని రావ‌డం, కడుపులోబంగారం పెట్టుకురావడం , బంగారం పోత‌బోసిన మైక్రో ఓవెన్లు, కుక్క‌ర్లు తీసుకురావ‌డం ఇలా అన్ని ర‌కాలుగా బంగారం స్మ‌గ్లింగ్ ప్ర‌య‌త్నం చేస్తున్నా… క‌స్ట‌మ్స్ ఇంటిలిజెన్స్ అధికారులు ప‌ట్టేస్తుంటారు. తాజాగా చెన్నైలో దొరిక‌న బంగారం స్మ‌గ్లింగ్ మ‌రీ విచిత్ర‌మైంది.

  ఓ వ్య‌క్తి 5 స్పాన‌ర్ల‌ను బంగారంతో త‌యారు చేయించి వాటిపై సిల్వ‌ర్ కోటింగ్ వేసి తీసుకొచ్చాడు. అడిగితే తాను ఓ కంపెనీలో టెక్నిక‌ల్ స్టాఫ్‌ అని స్పాన‌ర్లు, క‌టింగ్ ప్లేయ‌ర్ల‌తో త‌న‌కు ప‌ని ఉంటుంద‌ని చెప్పారు. అందుకే వీటిని వెంట తెచ్చుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ఇవి మామూలు కటింగ్ స్పానర్లని చెప్పాడు. అయితే అధికారుల‌కు అనుమానం రావ‌డంతో … స్పాన‌ర్ల మీద ఉన్న కోటింగ్‌ను గ‌ట్టిగా రుద్ద‌డంతో… లోప‌ల బంగారం క‌న‌ప‌డింది. ఆ స్పానర్లను తూకం వేస్తే ఒక కేజీ 2 గ్రాములు ఉన్నాయి. . ఆ బంగారం విలువ 40 ల‌క్ష‌ల‌కు పైగా ఉంటుంద‌ని నిర్దారించారు. రియాద్ నుంచి ఈ స్మగ్లర్ స్పానర్లను తెస్తున్నాడు.. స్మ‌గ్లింగ్ కు పాల్ప‌డిన నిందితుడిని అరెస్ట్ చేశారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.