ఆ బ్రాండ్ ఎంత తాగినా కిక్కు లేదని హైకోర్టుకు.

    0
    662

    మద్యం షాపుల్లో చీప్ బ్రాండ్లు కాదంటే ,వేల రూపాయలు విలువచేసే విదేశీ మద్యం , వీటన్నిటి మధ్య సామాన్యుడు , మధ్యతరగతి వ్యక్తి పోరాటం చేస్తుంటాడు. అయితే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అనే సేతియా ఓ వ్యక్తి ఇప్పుడు ఒక విచిత్రమైన వాదనతో కోర్టు కోర్టు లో కేసు వేసాడు. పిటిషన్ వేసి ఊరుకోలేదు సాక్షాలతో సహా కోర్టులో పిటిషన్ వేశాడు .

    ఇంతకీ ఆ పిటిషన్ సారాంశం ఏమిటంటే ఉజ్జయినిలోని కృష్ణసాగర్ అనే ప్రాంతంలో తాను కొనుగోలు చేసిన మద్యం బాటిల్స్ ఎంత తాగినా కిక్కు ఎక్కడంలేదని అతను ఆరోపిస్తున్నాడు. నాలుగు వారాల క్రితం నాలుగు క్వార్ట్రర్ మద్యం బాటిల్స్ కొన్నాడు. దానిలో రెండు బాటిల్స్ ఎంత తాగినా మంచినీళ్లు తాగినట్టే ఉంది తప్ప కిక్కు ఎక్కలేదు. ఈ విషయం షాపు యజమాని కి ఫిర్యాదు చేశాడు . ఇది కంపెనీ బ్రాండ్ అని నేను ఏమీ చేయలేనని షాపు ఓనరు చెప్పాడు. మళ్ళీ అదే బ్రాండ్ మద్యం కొని ఇద్దరు స్నేహితులతో కలిసి తాగాడు. మళ్లీ అదే పరిస్థితి. తనకే కాదు , వాళ్లకూ కిక్కు ఎక్కలేదు.

    ఎంత తాగినా కిక్కు ఎక్కక్క పోవడంతో ఎక్సైజ్ అధికారులకు రెండు బాటిల్స్ సాక్ష్యంగా ఇచ్చి ఫిర్యాదు చేశాడు . అయినా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు . వాళ్లకూ రెండు బాటిల్స్ ఇచ్చి చూడమన్నాడు. అక్కడి నుంచి కూడా ఎలాంటి సమాధానం లేదు . దీంతో ఏకంగా మరో నాలుగు బాటిల్స్ కొని తన న్యాయవాది ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశాడు .

    ఎంత తాగినా కిక్కు ఎక్కని ఈ మద్యం వల్ల పేద ప్రజలు అన్యాయమై పోతున్నారని, డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప కిక్కు ఎక్కడంలేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఆనందం కోసం తాగుదామని పొతే ,ఎంత తాగినా ఆనందం రాకపోతే అది తమను మోసం చేసినట్లేనని అందువల్ల ఈ కంపెనీ పై చర్యలు తీసుకుని పేద ప్రజలకు న్యాయం చేయాలని సేతియా హైకోర్టులో పోరాటం చేస్తున్నారు .

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.