మార్చి ఒకటిన పుడితే బంగారు ఉంగరాలు..ఎక్కడో తెలుసా..?

  0
  278

  రాజకీయ విచిత్రాలకు తమిళనాడు పెట్టిందిపేరు.. తమ నేతలను అభిమానించే వాళ్ళు చేసే సాహసాలు , అఘాయిత్యాలు ఒక్కో దఫా , భయం గొలిపేవిధంగా ఉంటాయి.. మరికొన్ని దఫాలు ఆశ్చర్యంగా ఉంటాయి..,ఇంకొన్ని దఫాలు నవ్విస్తాయి.. ఇప్పుడు ఒక డీఎంకే నాయకుడు మార్చి ఒకటో తేదీ పుట్టినవాళ్ళందరికీ బంగారు ఉంగరాలు ఇస్తానని ప్రకటించాడు..

  మార్చి ఒకటోతేదీ తమిళనాడు ముఖ్యమంత్రి , డీఎంకే అధినేత స్టాలిన్ పుట్టిన రోజు.. అందుకే తిరువళ్లూరు కి చెందిన డీఎంకే జిల్లా కన్వీనర్‌ భూపతి తిరువళ్లూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించే శిశువులకు బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు..ఇదివరకు స్టాలిన్ కొడుకు ఉదయనిధి పుట్టినరోజుకూడా , కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన బిడ్డలకు డీఎంకే నేతలు బంగారు ఉంగరాలు ఇచ్చారు.. గతంలో జయలలిత పుటిన రోజుల్లో కూడా ఇలాగేచేసేవాళ్ళు.. ఇప్పుడు స్టాలిన్ శకం కాబట్టి అదే సంప్రదాయం కొనసాగుతొంది..

   

  ఇవీ చదవండి… 

  బాబూ , బాబూ అంటూ ముద్దాడుతూ రోదిస్తున్న గౌతంరెడ్డి తల్లి

  మిస్ యూ గౌతమ్.. ఎమోషనల్ అవుతున్న బాల్య మిత్రులు..

  నా భార్య చీటర్.. ఆమె మోసాలతో నాకు సంబంధం లేదు..

  తాళి కట్టాక పెళ్లి కూతురు సినిమా చూపించింది..