పిల్లలకు బిస్కెట్స్ అనిచెప్పి బంగారు బిస్కెట్లతో..

  0
  385

  స్మగ్లర్ల ఎత్తులకు తక్కువే లేదు , అలాగే వాళ్ళని పట్టుకునే అధికారులు పైఎత్తులుకూ తక్కువ కాదు.. స్మగ్లర్ల దొంగబుద్ధిని ఎప్పటికప్పుడు అధికారులు పై ఎత్తులు వేసి వారి ఆట కట్టిస్తుంటారు. విదేశాల నుండి రకరకాల పద్ధతుల్లో బంగారాన్ని స్మగుల్ చేస్తుంటారు. ఇప్పుడు ఏకంగా మూడు కేజీల , రెండు వందల గ్రాముల బరువుండే బంగారాన్ని బిస్కెట్ లు గా మార్చి , బిస్కెట్ ప్యాకెట్ అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని బయటకు వచ్చేశారు .

  హ్యాండ్ బ్యాగ్ లో బిస్కెట్ ప్యాకెట్లు చిన్న బిడ్డల కోసం తీసుకున్నట్టు బుక్ అయింది. పసిపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ కదా కస్టమ్స్ అధికారులు వదిలేస్తారని పొరబడ్డారు . అయితే బిస్కెట్ ప్యాకెట్ బరువు చూసి కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి దాని చుట్టూ ఉన్న రిపేర్ విప్పి చూస్తే బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.ఒకటిన్నర కోటి రూపాయల విలువ గల ఈ బంగారు బిస్కెట్లను లక్నో ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులు ఈ టెక్నిక్ ఉపయోగించారు వాటిని తీసుకు వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  https://www.facebook.com/watch/?v=4978514778868618&extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&ref=sharing

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.