భారత దేశ సైనికులు గొప్పతనం ,త్యాగం ,వీరత్వం ఇదీ…

  0
  487

  ఒక దేశాన్ని శత్రువుల నుండి రక్షించుకోవడం లో ఆదేశానికి ఎన్ని ఆయుధాలు ఉన్నాయని లెక్క కాదు , ఎంత సంపన్నమైన దేశం అన్నదీ లెక్క కాదు, ఆ సైనికుల సంకల్పబలం ఎంత బలమైంది అన్నది ముఖ్యం . ఆ దేశ సైనికుల దెస భక్తి ఎంత గొప్పదో అన్నది ముఖ్యం, అలాంటి సైనికులకు మన దేశంలో కొరతేలేదు.. తీవ్ర వాదుల కాల్పుల్లో గాయపడి హాస్పిటల్ లో ఉన్న సిఆర్పిఎఫ్ జవాన్ తనను పరామర్శించేందుకు వచ్చిన ఉన్నతాధికారిని కోరిన కోరిక వింటే మన ఒళ్ళు జలదరిస్తుంది .

  ఉన్నతాధికారి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే , ఆ సైనికుడు చెప్పిన మాట,… ముందు ఉగ్రవాదులుని చంపండి , నేను తొందరగా వచ్చి చంపేస్తాను, ఇది మాత్రమే ఆ సైనికుడు అన్న మాట .. నేను త్వరలో మళ్లీ డ్యూటీ లో చేరుతానని ఉగ్రవాదులు చంపుతానని చెప్పాడు. మనదేశంలో సైనికుల సంకల్ప బలానికి ,త్యాగానికి ,వీరోచిత పోరాటానికి నిదర్శనం ఈ సైనికుడి మాట..

  కాశ్మీర్ లోని సోపోర్ ఆర్మీ క్యాంప్ పై తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి చుట్టూ తీవ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు . దీంతో నిరంజన్ సింగ్ ఈ సైనికుడు తన సహచర సిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ని కాపాడేందుకు రంగంలోకి దిగి తానొక్కడే ముగ్గురు తీవ్రవాదులని హతం చేసాడు. ఆ తర్వాత ఆ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న ఈ సైనికుడిలో , దేశాన్ని తీవ్రవాదుల నుంచి విముక్తం చేయాలన్న సంకల్పం మాత్రం వీడలేదు. భారత దేశ సైనికులు గొప్పతనం ,త్యాగం ,వీరత్వం ఇదీ…

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.