తప్పు చేసిన అమ్మాయిలు.. ఆ తప్పు ఒప్పుకోకపోగా.. ట్రాఫిక్ ఎస్సైను మరో అబ్బాయితో కలిసి చితక్కొట్టింది. ఇది చాలదన్నట్లు తన ఫ్రెండ్స్ ని పిలిచి రచ్చ చేసింది. ఎస్సై తనను అసభ్యంగా దూషించినట్లు ఎదురు దాడికి దిగారు. దక్షిణ ఢిల్లీలో ఓ యువకుడు మరో ఇద్దరు అమ్మాయిలు స్కూటీపై వెళుతున్నారు. ఆ స్కూటీకి నెంబర్ ప్లేట్ కూడా లేదు. రాంగ్ రూట్‌లో పోతున్నారు. దీంతో ట్రాఫిక్ ఎస్సై ఆ స్కూటీని ఆపినందుకు… ఎస్సైపై తిరగబడి, కొట్టబోయారు.
అమ్మాయిలు ఇద్దరైతే ఎస్సై కాలర్ పట్టుకుని మమ్మల్నే ఆపుతారా అంటూ దాడికి దిగారు. వారితో పాటు వచ్చిన వారి స్నేహితుడు, మరికొంతమంది ఎస్సైపై దాడి చేసేందుకు యత్నించారు. అయితే సీసీ కెమెరా దృశ్యాలు, మరియు చుట్టుపక్కల సాక్షుల ప్రకారం.. అమ్మాయిలదే తప్పు అని తేలింది. దీంతో పోలీసులు గాయపడిన ఎస్సైని హాస్పిటల్‌కి తరలించారు. దాడికి పాల్పడిన అమ్మాయిలు, అబ్బాయిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Girl attack on Delhi Traffic Police. Video goes Viral #Delhi #DelhiPolice @DelhiPolice @dtptraffic #tranding pic.twitter.com/ZfrFHjj4N4
— amit shukla (@amitshuklazee) June 8, 2022