భార్యకు ఉద్యోగం వచ్చిందని చెయ్యి నరికేశాడు..

  0
  1350

  మనుషుల్లో నీచులంటారు గానీ ఇలాంటి నీచులు మాత్రం అరుదుగా ఉంటారు.. అందులోనూ భర్తల్లో ఇలాంటి దుర్మార్గులు చాలా అరుదుగానే ఉంటారు.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం రావడం ఇష్టంలేక , అప్పాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన రోజే , భార్య చేతిని నరికేసిన , భర్త ఘాతుకమిది.. చేతిని నరకడమేకాదు , నరికేసిన చేతిని , ఇంట్లోనే దాచేసి , ఆమెను హాస్పిటల్లో చేర్చాడు.. ఇలా ఎందుకు చేసాడో తెలుసా..? నరికేసిన చేతిని మళ్ళీ అతికిస్తారని వీడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

  ఈ ఘోరం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని , బుర్ద్వాన్ జిల్లా కేతుగ్రమ్ గ్రామంలో జరిగింది.. నీచుడైన ఆ భర్తపేరు సరీఫుల్లాషేక్. భార్యపేరు రేనుఖాతూన్ .. ఆమె నర్సింగ్ కోర్సు చేసి , ఒక ప్రయివేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తోంది.

  భర్త , సోమరిపోతుగా ఉన్నాడు. భార్యకు , ప్రభుత్వ ఉద్యోగం రావడంతో , ఆమె తనను వదిలి వేరే చోటుకి ఉద్యోగానికి పోతుందని భయపడి , భార్యచేతిని నరికేశాడు. చేయలేకపోతే , నర్సు పని ఎలాచేస్తుందన్నది ఆ నీచుడి ఆలోచన.. నరికేసిన చేతిని , అతికిస్తారని తెలిసే , ఆ చెయ్యిని ఇంట్లో దాచిపెట్టేసాడు. పోలీసులు కేసునమోదు చేశారు.. ఇప్పుడు ఆ నీచుడి కుటుంబం మొత్తం పరారీలో ఉంది..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..