కీచక టీచర్ కి మరణ శిక్ష..

    0
    759

    ఇండోనేషియాలో ఇస్లామిక్ స్కూల్ టీచర్ కు కోర్టు మరణ శిక్ష విధించింది.. ఈ కీచక టీచర్, ఇస్లామిక్ స్కూల్ లోని పేద విద్యార్థినులను 13 మందిని అత్యాచారం చేశాడు.. మరియు వారిలో 8 మంది బాలికలు గర్భం దాల్చారు . వీరంతా 13 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న బాలికలే.. హెరివిరవన్ అనే పేరున్న ఇస్లామిక్ కి టీచర్ గత రెండేళ్లలోనే ఇంత మంది బాలికలపై అత్యాచారం చేశాడు . గతంలో కూడా ఇతని పై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ చాలామంది భయపడి చిన్న పిల్లలు కావడంతో స్కూల్ నుంచి వెళ్లిపోయారు. అయితే వీడి పాపం పండి స్కూల్ లో ఎనిమిది మంది బాలికలు ఒకేసారి గర్భవతులు కావడంతో ఇది సంచలనమైంది .

    దీంతో ఇండోనేషియా ప్రభుత్వం అతనిమీద బంధం కోర్టులో కేసు దాఖలు చేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి మొదట అతడికి యావజ్జీవ శిక్ష విధించారు . అయితే ఈ శిక్షపై దేశ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది . ఎనిమిది మందిబాలికలను గర్భవతులనిచేసి , మరో ఐదు మందిపై అత్యాచారం చేసి, వారిని తన స్కూల్ లో బంధించి బెదిరించిన టీచర్ ఇంత సులభమైన శిక్ష ఏమిటని పలువురు సామాజిక వాదులు న్యాయవాదులు ఉద్యమం లేవదీశారు . దీంతో అతడికి ఉన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది . వారంరోజుల్లో అతనికి మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించింది.

    ఇండోనేషియాలో వేలాదిగా ఇస్లామిక్ స్కూల్స్ ఉన్నాయి . పేద పిల్లలు ఎక్కువగా ఈ స్కూల్స్ లోనే చదువుకుంటారు. ఇండోనేషియా బాలికల సంరక్షణ సమితి కూడా ఈ విషయంలో తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది . పేదరికం కారణంగా చాలా మంది బాలికలు తమపై జరిగే అత్యాచారాలను చెప్పకుండా స్కూల్ నుంచి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాకాకుండా స్కూల్ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయే ప్రతి బాలిక ఎందుకు పోతుంది అన్న విషయం మహిళలు అధికారులు న్యాయవాదులు సమక్షంలో చర్చించాలని కూడా డిమాండ్ చేసింది. ఆ దేశ మానవ హక్కుల సంఘం మాత్రంకీచక టీచర్ కి విధించిన ఈ మరణశిక్ష సమంజసం కాదని వాదించింది..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.