డయిల్ -100 కి ఫోన్ చేయడమంటే , ఏదో కొంపలు మునిగే ఆపద వస్తే చేస్తారు.. లేదా ఏదైనా నేరం జరుగుతుంటే చేస్త్తారు .. అయితే , తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయడంలేదని ఓ అమ్మాయి పోలీసులకు 100 కి డయల్ చేసి ఫిర్యాదు చేసింది.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా , ఫోన్ కట్ చేస్తున్నాడని చెప్పింది. టెన్షన్ భరించలేకున్నానని , అందువల్ల తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడించాలని కోరింది.. అలా కోరడమే కాదు , ఏకంగా పోలీసు స్టేషన్ కి వచ్చి , రిటన్ కంప్లైంట్ ఇచ్చి , అక్కడే కూర్చుంది . దీంతో ఛింద్వారా డిఎస్పీ నేరుగా రంగంలోకి దిగాడు. ఫోన్ నంబర్ ద్వారా లవర్ అడ్రెస్స్ తెలుసుకొని , స్టేషన్ కి తీసుకొచ్చారు. తన బర్త్ డే రోజు , ఎన్ని సార్లు ఫోన్ చేసినా , అమ్మాయి ఫోన్ తీయలేదని , తనకు గ్రీటింగ్స్ చెప్పలేదని , అందుకే అమ్మాయి ఫోన్ తాను లిఫ్ట్ చేయలేదని చెప్పాడు.. ఎలాగైతేనేమి , పోలీసులు ఇద్దరినీ కలపడమేకాదు , ఒక్క రోజులో ఇద్దరి పెద్దలతో మాట్లాడి , ఆర్యసమాజ్ లో పెళ్లికూడా చేశారు..