ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి. ఈ యువతికి సోషల్ మీడియా పిచ్చి. సోషల్ మీడియాలో లైక్ ల కోసం పిచ్చి వేషాలు వేసింది. నడిరోడ్డుపై ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ డ్యాన్సులు చేసింది. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఇండోర్ లోని రసోమాస్ స్క్వేర్ ప్రాంతంలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఓ యువతి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ… నడిరోడ్డుపై డ్యాన్సులు వేయడం మొదలుపెట్టింది.
ఆడపిల్ల డ్యాన్సులు వేస్తుంటే చూడకుండా ఉంటారా ? పాదచారులు, వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయి, అమ్మాయి వేసే చిందులు చూస్తుండిపోయారు. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో మంత్రి వరకు వెళ్ళడంతో, ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చే లైకుల పిచ్చిలో పడి.. చిక్కుల్లో పడిందా యువతి.
Madhya Pradesh: A video of a little girl dancing to the Doja Cat song at Rasoma Square, Indore is going viral. The 30 seconds video, probably a reel, shows the girl grooving in the middle of the road amid traffic. pic.twitter.com/id3xML5vJX
— Free Press Journal (@fpjindia) September 15, 2021