మార్నింగ్ వాక్ లో మొసలి నోటికి చిక్కాడు,,.

    0
    709

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉథమ్ సింగ్ నగర్ జిల్లా ఖతిమా లో ఓ వ్యక్తి మార్నింగ్ వాక్ కి వెళ్లి తిరిగి రాలేదు. 3 రోజులపాటు ఆ వ్యక్తికోసం గ్రామస్తులు అడవి అంతా గాలించారు. జాడ కనిపించలేదు. రెండురోజుల క్రితం అటవీ శాఖ అధికారి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా మొసలి, ఓ మనిషి శవాన్ని పీక్కుతింటూ కనిపించింది. అప్పటికే దాదాపు సగం శరీరం మొసలికి ఆహారంగా మారిపోయింది. దీంతో ఆ అధికారి గ్రామ పెద్దకు ఫిర్యాదు చేసి ఆ వ్యక్తి శవాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ మృతదహాన్ని ఉదయం వాకింగ్ కి వెళ్లిన సుఖదేవ్ సింగ్ గా గుర్తించారు. గతంలో కూడా వాకింగ్ లకు ఆ సెలయేటి వెంబడి పోయినవారిని మొసళ్లు చంపేసి ఆహారంగా చేసుకున్న ఉదంతాలు అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసినా సుఖదేవ్ సెలయేటి వద్దనే వాకింగ్ కి ఎందుకు పోయాడనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఏ విషయం నిర్థారిస్తామని పోలీసులు చెప్పారు. 12ఏళ్ల కాలంలో ఈ ఏటిలో మొసళ్ల సంఖ్య నాలుగింతలు పెరిగింది. ఈ ఖతియా ప్రాంతంలో మగ్గర్, ఘరియల్.. అనే మంచినీటి మొసళ్లుంటాయి. గత ఏడాది సెప్టెంబర్ లో కూడా ఎనిమిదేళ్ల బాలికను ఈ మొసళ్లు చంపి తినేశాయి.

    ఇవీ చదవండి..

    మాజీ సిఎం భార్య చెల్లెలు, ఫుట్ పాత్ పై యాచన.

    25 సార్లు లేచిపోయింది.. అయినా క్షమించిన భర్త .

    తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

    పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్