భారతదేశంలో పెళ్లిళ్లు హంగు ఆర్భాటాలకు నిదర్శనం.. కోట్ల రూపాయల డబ్బు తగలేస్తారు.. అందుకే ప్రపంచంలో మనదేశంలో పెళ్లిళ్లకు ఫ్యాట్ వెడ్డింగ్స్ అని పేరు.. అసలైన భాషలో చెప్పాలంటే , డబ్బు అనే కొవ్వు ఎక్కి చేసే పెళ్లిళ్లు.. ఇలాంటి పెళ్లిళ్లు ఇప్పుడు మధ్యతరగతినీ పట్టుకున్నాయి.. అప్పుచేసైనా పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలని , తిప్పలు పడుతున్నారు.. ఇలాంటి పెళ్ళికి ఇదో ఉదాహరణ.. కలకత్తాలో పాపియా అనే మహిళ , తన సోదరుడి పెళ్లిలో వృధా అయిన బోజనాలన్నీ , రాత్రి ఒంటి గంట సమయంలో తీసుకొచ్చి ప్లాట్ ఫారం పై ఆకలితో పడుకున్నవారిని లేపి మరీ స్వయంగా వడ్డించింది.
వంటినిండా బంగారు నగలతోనే , ఒంటరిగానే వచ్చింది. కలకత్తా లాంటి , సిటీలో ఇలా రావడం క్షేమం కాదు.. అయినా అన్నం పెట్టేందుకు వచ్చిన తనను ఎవరూ ఏమీచేయరని ఆమె దైర్యంగా ఉండింది.. కొసమెరుపు ఏమిటంటే , ఆమె తిరుగు ప్రయాణంలో , ఆ పేదల్లో కొందరు , ఆమె కారు ముందే పరుగుపెట్టి , ఆమెను ఇంటివరకు వదిలేసి రావడం.. అదీ ఆకలిగొన్న కడుపుల కృతజ్ఞత..